వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళను లాక్కెళ్లిన మొసలి: పారిపోయిన చిరుత

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్/ముంబై: ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపార జిల్లా ఉన్న భితార్ కనికా జాతీయ పార్కులో ఓ మొసలి 38ఏళ్ల మహిళను నీటిలోకి లాక్కెళ్లింది. బౌలాప్రధాస్ అనే మత్స్యకార మహిళను అజగరపాటియా క్రీక్ సమీపంలోని మొసలి లాక్కెళ్లినట్లు రాజ్‌నగర్ మాంగ్రోవ్ అటవీశాఖాధికారి కేదార్ కుమార్ శ్వేస్ తెలిపారు.

ఇలాంటి ఘటనలు ఇక్కడ గతంలో కూడా జరగడంతో సమీప గ్రామాల ప్రజల ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేశారు.

Odisha Woman Missing After Crocodile Dragged Her Away

చిరుతను బావిలోంచి బయటికితీస్తే పారిపోయింది

ముంబై: మహారాష్ట్రలోని ఖఫా ప్రాంతంలో చిరుత ఓ బావిలో పడింది. గమనించిన స్థానిక రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు నులక మంచం సాయంతో బావిలోంచి చిరుతను బయటికి తీశారు.

కాగా, బావిలోంచి బయటపడిన చిరుత అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన వలలో చిక్కకుండా తప్పించుకుని పొలాల్లోకి పారిపోయింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్లే చిరుత పారిపోయిందని గ్రామస్తులు ఆరోపించారు. చిరుత వల్ల తమకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
A 38-year-old woman was attacked and dragged into water by a crocodile in Bhitarkanika National Park in Odisha's Kendrapara district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X