వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొట్లూరి: పవన్ సంచలన వ్యాఖ్యలు, జెపి కోసమే వదిలా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan targets YS Jagan
బెంగళూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం సంచలన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పొట్లూరి వర ప్రసాద్ తనకు మిత్రుడు అని, సిబిఐ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. జైలులో ఏళ్ల తరబడి ఉన్న వారు పోటీ చేస్తుండగా.. పివిపి ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేమిటని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. పొట్లూరి చాలా మంచి వ్యక్తి అన్నారు.

తెలుగుదేశం పార్టీ టికెట్ల వ్యవహారంలో తాను కలగజేసుకోవడం లేదన్నారు. భారతీయ జనతా పార్టీ-తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు కోసం తాను ప్రచారం చేస్తానని చెప్పారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో లోకసత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణకు తాను మద్దతిస్తున్నట్లు చెప్పారు.

మల్కాజిగిరిలో తాను జయప్రకాశ్ నారాయణకు మద్దతుగా ప్రచారం చేస్తానని చెప్పారు. మల్కాజిగిరి నుండి పోటీ చేయాలని తాను మొదట భావించానని కానీ, జెపి కోసం విరమించుకున్నానని చెప్పారు. జనసేన పార్టీ ఎన్డీయేలో భాగస్వామియేనని స్పష్టం చేశారు.

అంతకుముందు కర్నాటక ప్రచారంలో మాట్లాడుతూ... తెలుగువారి కోసం ఎక్కడికైనా వస్తానన్నారు. కాంగ్రెస్‌ను దేశం నుంచి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రత గురించి కన్నడిగులకు బాగా తెలుసన్నారు. మోడీకి పని తప్ప వేరే తెలియదన్నారు. మోడీకి వ్యక్తిగత ఆస్తులు ఏమీ లేవన్నారు. కాంగ్రెసు కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

English summary
Jana Sena party chief Power Star Pawan Kalyan targetted YSR Congress Party chief YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X