వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూ వ్యతిరేకులం కాదు, కానీ: అక్బరుద్దీన్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మజ్లిస్ పార్టీ ముఖ్యనేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొన్నటి వరకు హైదరాబాదుకు పరిమితం అయిన మజ్లిస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల పైన దృష్టి సారించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోను పట్టు ఉందని భావించిన చోట్ల పోటీ చేస్తోంది. ముంబైలో ప్రచారం చేస్తున్న అక్బరుద్దీన్.. తాము యాంటీ హిందూ కాదని, సంఘ్ పరివార్ ఐడియాలజీని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు.

మైనార్టీల పైన పలు పార్టీలు సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నాయని, సెకండ్ క్లాస్ సిటిజన్లుగా చూస్తూన్నాయని ఆరోపిస్తున్నారు. కాగా, మజ్లిస్ పార్టీ మహారాష్ట్రలో 26 స్థానాలలో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. అందులో ముంబై, థానేలలో 13 స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టారు. ముస్లీం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో అభ్యర్థుల్ని నిలబెట్టారు.

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్

మజ్లిస్ పార్టీ ముఖ్యనేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్

మొన్నటి వరకు హైదరాబాదుకు పరిమితం అయిన మజ్లిస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల పైన దృష్టి సారించిన విషయం తెలిసిందే.

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్

ఇందులో భాగంగా ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోను పట్టు ఉందని భావించిన చోట్ల పోటీ చేస్తోంది.

అక్బరుద్దీన్

అక్బరుద్దీన్

ముంబైలో ప్రచారం చేస్తున్న అక్బరుద్దీన్.. తాము యాంటీ హిందూ కాదని, సంఘ్ పరివార్ ఐడియాలజీని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు.

English summary
photos of akbarduddin addressing election meeting in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X