వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిర్డి సాయిపై వ్యాఖ్యలు: చిక్కుల్లో స్వరూపానంద

By Pratap
|
Google Oneindia TeluguNews

PIL against Shankaracharya Swaroopanda
హైదరాబాద్: సాయిబాబా దేవుడు కాదని, సాయిబాబా ఓ ముస్లిం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి లక్షలాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచారంటూ ద్వారకాపీఠ్ శంకరాచార్యులు స్వరూపానంద సరస్వతిపై లక్నోలోని సాయి ఆలయ అథారిటీ అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.

భక్తుల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు స్వరూపానంద సరస్వతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు. పిటిషన్‌పై కోర్టు శుక్రవారం విచారణ జరిపే అవకాశం ఉంది. షిరిడీ సాయిబాబా దేవుడు కాదని, ఆయనను పూజించడం తప్పంటూ కొన్ని రోజుల కిందట శంకరాచార్య చేసిన వ్యాఖ్యలు సాయిబాబా భక్తులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే పలుచోట్ల ఆయనపై భక్తులు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. షిర్డీ సాయిబాబా దేవుడు కాడని, సాయిబాబాకు పూజలు చేయవద్దని స్వరూపానంద సరస్వతి సూచించారు.
సాయిబాబా తనకు తాను ముస్లింగా చెప్పుకున్నారని, అలాంటపుడు ఆయన విగ్రహానికి గంగానదిలో పదేపదే స్నానాదికాలు చేయించడమెందుకని ప్రశ్నించారు.

తాను హిందూమత రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. తనను జైలుకు పంపించినప్పటికీ తాను హిందూమతం కోసం ప్రచారం చేస్తానని చెప్పారు. తాను జైలుకు వెళ్లినా, తన దిష్టిబొమ్మలను దగ్ధం చేసినా తాను హిందూమతం కోసమే తాపత్రయపడతానన్నారు.

English summary

 A PIL has been filed in Allahabad court against Dwarakapeeth Shankaracharya Swaroopanda Saraswathi for his comments on Shirdi Saibaba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X