వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్మెట్ లేదని భార్యకే జరిమానా విధించిన ట్రాఫిక్ ఎస్సై

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేసినప్పడు మనకు తెలిసినవారి పేరు చెప్పి చలానా కూకుండా తప్పించుకుంటూ ఉంటాం. ఐతే ఉత్తర ప్రదేశ్‌లో ఒక ట్రాఫిక్ పోలీస్ ఎస్సై మాత్రం రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను తన భార్యకే జరిమానా వేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

police officer penalises wife for flouting traffic norms

వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ పట్టణంలోని మధుసూదన్ చౌదరి క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కంప్యూటర్ మరమ్మతు చేయించుకోవడానికి అతని భార్య ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చింది. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసిన భార్యను ఆపిన ట్రాఫిక్ ఎస్సై, ఆమె ద్విచక్రవాహనానికి నంబర్ ప్లేట్ కూడా విరిగిపోయినట్లు గుర్తించాడు.

రెండింటికీ కలిపి అతని భార్యకు జరిమానా రాసి శభాష్ అనిపించుకున్నాడు. దీనిపై ఎస్సై మాట్లాడుతూ సమాజంలో మార్పు అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని తెలిపాడు.

English summary

 Setting an example for others who try to escape traffic violation penalty by calling influential people, a traffic police sub-inspector in Ghaziabad penalised his wife for not wearing helmet and broken number plate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X