వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోటల్‌లో గర్భిణితో బద్రీనాథ్ పూజారి అసభ్యత, అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Girl
న్యూఢిల్లీ: ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ ప్రధాన పూజారి కేశవన్ నంబూద్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కేశవన్‌కు ఢిల్లీ కోర్టు పద్నాలుగు రోజుల జుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన గర్బిణీ మహిళను వేధించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.

సోమవారం సాయంత్రం 4.30 ప్రాంతంలో 28 ఏళ్ల గర్భిణీ మహిళను స్థానిక హోటల్‌కు పిలిపించారని, రూమ్‌కు రాగానే కేశవన్ లైంగికంగా వేధించాడని ఆ మహిళ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.

కేశవన్‌తో పాటు అతని అనుచరుడు విష్ణుప్రసాద్‌ను కూడా హోటల్ గదిలో అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం వీరిని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఈ నెల 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. నిందితులిద్దరూ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.

వారిద్దరి కస్టడీని పోలీసులు తీసుకోలేదు. ఈ కేసులో వారిద్దరే నిందితులని, ఇక కస్టడీకి తీసుకొని విచారించాల్సిన అవసరం లేదని పోలీసులు కోర్టుకు తెలియజేశారు.

మరోవైపు ఆలయ ప్రధాన పూజారి కేశవన్ నంబూద్రిని సస్పెండ్ చేసినట్లు బద్రీ-కేదార్ ఆలయ కమిటీ చీఫ్ గణేష్ గొడియాల్ వెల్లడించారు. కేశవన్ స్థానంలో విసి ఈశ్వర్ ప్రసాద్ ప్రధాన పూజారి బాధ్యతలను నిర్వహిస్తారని ప్రకటించారు.

English summary
The Chief priest of Badrinath temple was arrested Tuesday by Delhi Police for allegedly confining a 30-year-old pregnant woman inside a hotel room in South Delhi’s Mehrauli area and molesting her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X