వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌పై నిందలు వద్దు: కాంగ్రెస్ ఓటమిపై ఆంటోనీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi not to be blamed for Congress defeat in Lok Sabha polls: Antony
న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి రాహుల్ గాంధీని నిందించడం తగదని కాంగ్రెసు సీనియర్ నేత ఎకె ఆంటోనీ ఆభిప్రాయపడ్డారు. కాంగ్రెసు ఓటమిపై ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ సమీక్ష చేసి నివేదికను రూపొందించింది. ఈ కమిటీ రాహుల్ గాంధీని నిందించే ఉద్దేశంతో లేదు.

ఓటమికి రాహుల్ గాంధీని నిందించకూడదని, పార్టీని బలహీనపరచడానికి కొంత మంది రాహుల్ గాంధీని నిందించే పని పెట్టుకున్నారని ఆంటోనీ కమిటీ అభిప్రాయపడింది. కమిటీ నివేదికను గురువారంనాడు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందించారు. పా్రటీ ఓటమికి ఇతర కారణాలు ఉన్నాయని నివేదికలో అభిప్రాయపడ్డారు.

సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఆంటోనీ అభిప్రాయపడ్డారు. కమిటీ సభ్యులు ఆంటోనీ, ముకుల్ వాస్నిక్, ఆర్‌సి కుంటియా, అవినాష్ పాండే గురువారంనాడు సోనియా గాంధీని కలిసి నివేదికను అందించారు.

అత్యంత భారీగా ఉన్న నివేదిక సంక్షిప్త పాఠాన్ని కూడా సోనియాకు అందించారు. రాష్ట్రాలను విడివిడిగా తీసుకుని ఆయా రాష్ట్రాల నాయకులతో మాట్లాడి నివేదికను రూపొందించారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నివేదిక ఆధారంగా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
The much-talked about report of the AK Antony panel, which went into the reasons of worst-ever poll debacle of Congress, has not blamed Congress vice president Rahul Gandhi in its observations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X