వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ రేప్ కేసు: ఇద్దరు జిమ్ ఇన్‌స్ట్రక్టర్ల అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని విబ్జియార్ పాఠశాలలో జరిగిన ఆరేళ్ల బాలిక అత్యాచారం కేసులో పోలీసులు ఇద్దరు జిమ్ ఇన్‌స్ట్రక్టర్లను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు. ఈ కేసులో ఇదివరకు పోలీసులు స్కేటింగ్ ఇన్‌స్ట్రక్టర్‌ను అరెస్టు చేశారు.

ఘటనా స్థలంలోని సాక్ష్యాల ఆధారంగా, వాంగ్మూలాల ఆధారంగా వారిని అరెస్టు చేసినట్లు బెంగళూర్ పోలీసు కమిషనర్ తెలిపారు. నిందితుల్లో ఒక్కతను నేరాన్ని అంగీకరించినట్లు టీవీ చానెళ్లలో వార్తలు వచ్చాయి.

Rape of 6-year-old in Bangalore school: 2 gym instructors arrested

ఆరేళ్ల బాలికపై పాఠశాల ఆవరణలో జులై 2వ తేదీన అత్యాచారం జరగ్గా, అది జులై 14వ తేదీన వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగు చూసింది. ఈ ఘటనతో బెంగళూర్‌లో తీవ్ర నిరసన జ్వాలలు పెల్లుబికాయి.

కాగా, విబ్జియార్ పాఠశాలను సోమవారంనాడు తిరిగి తెరిచారు. తొలుత అరెస్టయిన స్కేటింగ్ ఇన్‌స్పెక్టర్‌ను పాఠశాల యాజమాన్యం అంతకు ముందే ఉద్యోగంలోంచి తీసేసినట్లు వార్తలు వచ్చాయి.

English summary
Bangalore Police on Tuesday announced the arrest of two gym instructors in connection with the rape of a six-year-old girl in a public school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X