వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరా గాంధీ హంతకులపై సినిమా విడుదలకు బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Indira Gandhi
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల జీవితాల ఆధారంగా తీసిన వివాదాస్పద పంజాబీ సినిమా ‘కౌమ్ దే హీరే' విడుదలను కేంద్ర ప్రభుత్వం గురువారం నిలిపివేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తవచ్చన్న భయాలను కారణాలుగా చూపిస్తూ శుక్రవారం విడుదల కావలసిన ఈ సినిమాను ప్రభుత్వం ఆపేసింది. గురువారం సినిమాను చూసిన తర్వాత సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర ఫిలిమ్ సర్ట్ఫికేషన్ బోర్డు (సిబిఎఫ్‌సి) ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

తాము ఈ చిత్రాన్ని చూశామని, రేపు ఈ సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయించామని హోంమంత్రిత్వ శాఖ సిపార్సులపై సినిమాను సమీక్షించిన తర్వాత సిబిఎఫ్‌సి చైర్‌పర్సన్ లీలా శామ్సన్ గురువారంనాడు చెప్పారు. సినిమా ప్రదర్శన కారణంగా తలెత్తబోయే శాంతిభద్రతల పరిస్థితి, హోం మంత్రిత్వ శాఖ నివేదిక ఆధారంగా హోం మంత్రిత్వ శాఖ, సిబిఎఫ్‌సి, సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నాయని ఆమె చెప్పారు.

సినిమాలోని అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హోం శాఖ ఈ సినిమా వల్ల పంజాబ్, ఉత్తర భారతంలోని ఇతర రాష్ట్రాల్లో మత సామరస్యానికి విఘాతం కలగవచ్చన్న భయాలను సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు పంపిన ఓ ఉత్తర్వులో వ్యక్తం చేసింది. ఇందిరాగాంధీ హంతకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్, కేహర్ సింగ్ జీవితాల ఆధారంగా తీసిన ఈ సినిమాలో వారి చర్యను గొప్పదిగా చిత్రీకరించారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

అంతేకాకుండా అవినీతి ఆరోపణలపై ఇటీవల అరెస్టు చేసిన సెన్సార్ బోర్డు సిఈఓ రాకేశ్ కుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుని ఈ సినిమాకు క్లియరెన్సు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.

English summary
Citing law and order concerns, the government on Thursday stalled the release of controversial Punjabi film 'Kaum de Heere' on former PM Indira Gandhi's assassination. The film was scheduled for release on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X