వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవార్డు: సచిన్‌కు దక్కిన మరో అరుదైన గౌరవం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు, భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మరో కీర్తి కిరీటాన్ని అందుకోనున్నాడు. ప్రఖ్యాత జెయింట్స్ ఇంటర్నేషనల్ అవార్డుకు సచిన్ ఎంపికయ్యాడు. అంతర్జాతీయంగా క్రీడలకు మరింత వన్నెతెచ్చినందుకు గాను గుర్తింపుగా జీవితకాల సాఫల్యత అవార్డు (లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్) పురస్కారాన్ని సచిన్ టెండూల్కర్ అందుకోనున్నారు.

ఇక బాలీవుడ్ నుంచి అలనాటి డ్యాన్సింగ్ క్వీన్ హెలెన్ సలీం ఖాన్‌ 'లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్' అవార్డు ఇవ్వనున్నారు. ముంబైలో బుధవారం జరగే ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ (బిజెపీ) అధ్యక్షుడు అమిత్ షా అవార్డులను ప్రధానం చేస్తారు.

Sachin Tendulkar Named for Giants International Awards

ఈ ఏడాది జెయింట్స్ ఇంటర్నేషనల్ అవార్డులకు ఎంపికైనా వారిలో ఉర్వి పిరమల్ (బిజినెస్ & ఇండస్ట్రీ), హేమంత్ థాకర్ (మెడిసిన్), కులిన్ కాంత్ లుథియా (సోషల్ సర్వీస్), బాహుబలి షా (జర్నలిజం), అను మాలిక్ (మ్యూజిక్), పతంగ్ రావు కదమ్ (విద్య) ఉన్నారు.

కాగా, భారత్‌లో ఆరంభమైన తొలి అంతర్జాతీయ సేవా సంస్థగా జెయింట్స్ ఇంటర్నేషనల్‌కు పేరు ప్రఖ్యాతులున్నాయి. 1972 సెప్టెంబర్ 17న ఈ సంస్థ తన కార్యకలాపాలు ఆరంభించింది. నానా చూడసామా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సంస్దకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

దీనికి భారత్ లో 600 బ్రాంచీలు ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, ఉక్రెయిన్, మారిషస్ లోనూ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

English summary

 
 Cricket maestro and Bharat Ratna Sachin Tendulkar and Bollywood danseuse Helen are among this year's Giants International awardees, according to an announcement here Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X