వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీఏ గవర్నర్లు: నరేంద్రమోడీకి షీలాదీక్షిత్ నిలదీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మండిపడ్డారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను లక్ష్యంగా మార్చుకున్నారని షీలా మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడారు.

యూపీఏ ప్రభుత్వంలో నియమించిన గవర్నర్లను పదవి నుంచి వైదొలగాలని ఎందుకు కోరారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఢిల్లీ, మధ్యప్రదేశ్ గవర్నర్లను మాత్రం ఎందుకు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sheila Dikshit questions Modi govt on biased behaviour towards guvs

మిగతా వాళ్లను దిగిపోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. తొలగింపు వెనుక గల వివక్షతను అర్థం చేసుకోవడంలో తాను విఫలమయ్యానన్నారు. రాజ్యాంగపదవుల పట్ల అవమానకరంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాగా, షీలా దీక్షిత్ గత నెల వరకు కేరళకు గవర్నర్‌గా ఉన్నారు.

English summary
Former Delhi CM Sheila Dikshit on Tuesday hit out at the Narendra Modi government for targeting UPA-appointed governors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X