వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరామర్శ: ఇది తీసుకో అంటున్న సోనియా(పిక్చర్స్)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూ కాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా జమ్మూ కాశ్మీర్‌ అంతా అతలాకుతలమైన విషయం తెలిసిందే.

మొదటగా అనంతనాగ్‌లోని దుర్బర పరిస్దితులను ఎదుర్కొంటున్న వరద బాధితులను పరామర్సించారు. ఆ తర్వాత బీరవా బుగ్డమ్‌కు వెళ్లి అనంతరం శ్రీనగర్‌లోని హాస్పిటల్స్‌ సందర్శించారు. రేపు జమ్మూలోని ప్రాంతాలను పర్యటించనున్నారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీనగర్‌ లోని కాంగ్రెస్ నాయకులతో సమావేశమైన సోనియా గాంధీ వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దగ్గరుండి మరీ వరదకు గురైన ప్రాంతాల గురించి తెలపడంతో పాటు, మౌలిక సదుపాయల కల్పనకు ఏమి చేస్తున్నారనే విషయం గురించి తెలియజేస్తారు. వారితో పాటు ఆ రాష్ట్ర పార్టీ నేతలు గులాం నబీ ఆజాద్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ అంబికా సోనీ, పలువురు వారి వెంట ఉన్నారు.

గత 60 ఏళ్లలో ఇలాంటి వరదలను తామెన్నడూ చూడలేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ వరదల్లో 200కు పైగా చనిపోయినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్‌లో వరదల కారణంగా దాదాపు రూ. 6 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు అసోచామ్ ప్రాథమికంగా అంచనా వేసింది.

వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో వరద బాధితులను పరామర్సించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.

దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో వరద బాధితులను పరామర్సించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.

 వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో వరద బాధితులను పరామర్సించడానికి వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిని ముద్దాడుతున్న బాధితురాలు.

 వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో వరద బాధితులను పరామర్సించడానికి వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కార్డు చూపుతున్న బాధితుడు.

వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో వరద బాధితులను పరామర్సించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. బాధితులకు షేక్ హ్యాండ్ ఇస్తున్న దృశ్యం.

వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో వరద బాధితుల క్షేమసమాచారాలను అడిగి తెలుసుకుంటున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పక్కనే ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.
వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

వరద బాధితులను పరామర్శించిన సోనియా, రాహుల్

భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతమైన జమ్మా కాశ్మీర్ వరదబాధితులకు సహాయ సామాగ్రిని అందజేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

English summary

 Sonia and Rahul will interact with the affected families in Anatnag. They will go to Beerwah Budgam and later in they will be visiting Srinagar hospitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X