వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాఖ్యలు: స్టాలిన్‌పై జయలలిత పరువు నష్టం దావా

By Pratap
|
Google Oneindia TeluguNews

Tamil Nadu govt files defamation case against Stalin
చెన్నై: డిఎంకె కోశాధికారి ఎంకె స్టాలిన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువు నష్టం దావా వేశారు. శాసనసభ వెలుపల తనకు, శాసనసభలో స్పీకర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు స్టాలిన్‌పై తమిళనాడు ప్రభుత్వం కేసు పెట్టింది.

జయలలిత తరఫున చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎంఎల్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు. స్టాలిన్ సహా డిఎంకె శాసనసభ్యులను కొంత మందిని శాసనసభ నుంచి ఈ నెల 22వ తేదీన బయటకు పంపించారు.

ఆ సందర్భంలో స్టాలిన్, మరికొందరు శాసనసభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ప్రాసిక్యూటర్ జగన్ తన పిటిషన్‌లో ఆరోపించారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు.

సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష సభ్యులను అనుమతించడానికి ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు, మంత్రులకు ఇష్టం లేదని స్టాలిన్ అన్నట్లు చెబుతున్నారు. డిఎంకె శాసనసభ్యులు సభలో ఉండడం వారికి ఇష్టం లేదని ఆయన అన్నారు. జులై 22వ తేదీన ముఖ్యమంత్రి సభలో లేరని, అయినా కావాలని వ్యాఖ్యలను ముఖ్యమంత్రికి అంటగట్టారని పిటిషన్‌లో అన్నారు.

English summary

 The Tamil Nadu government on Wednesday initiated criminal defamation proceedings against DMK treasurer and former deputy chief minister M K Stalin, saying he made derogatory statements on DMK MLAs' suspension from the assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X