వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడిచే భర్త ఫ్యామిలి హత్య, టెక్కీ హెల్ప్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. హత్య అనంతరం తన ప్రియుడు తప్పించుకునేందుకు ఆ ప్రియురాలు వాట్సప్ అప్లికేషన్‌ను ఉపయోగించింది. గత బుధవారం కేరళలోని తిరువనంతపురంలో జంట హత్యలు జరిగాయి.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు నినో మాథ్యూ (40), అను శాంతి (30) అనే ఇద్దరు టెక్కీలను అరెస్టు చేశారు. వీరిద్దరు తిరువనంతపురంలోని ఓ ఐటి కంపెనలో పని చేస్తున్నారు. అనుశాంతి కూతురు స్వస్తిక, అత్త ఓమన హత్య కేసులో పోలీసులు ఆమెను, నినో మాథ్యును అరెస్టు చేశారు. అనుశాంతి, నినోల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లుగా గుర్తించారు.

స్వస్తికను, ఓమనను నినో హత్య చేసిన అనంతరం... అతను తప్పించుకునేందుకు... అనుశాంతి తన ఇంటికి సంబంధించిన ఫోటోలను, ఎలా తప్పించుకోవాలో వివరించేందుకు వాట్సప్ ఉపయోగించి పంపించారు. అనుశాంతి భర్త లిజీష్‌ను కూడా హత్య చేద్దామనుకున్నప్పటికీ అతడు గాయాలతో బయటపడ్డాడు. దీంతో నిందుతులు బయట పడ్డారు.

తిరువనంతపురం

తిరువనంతపురం

వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని చెబుతున్నారు. నినో బుధవారం పన్నెండున్నర గంటల సమయంలో అనుశాంతి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో అనుశాంతి కూతురు స్వస్తిక, అత్త ఓమన ఉన్నారు. తాను లిజీష్ స్నేహితుడినని, తన పెళ్లి ఉందని, ఆహ్వానించేందుకు వచ్చానని ఓమనకు నినో చెప్పాడు.

తిరువనంతపురం

తిరువనంతపురం

తన కొడుకు లిజీష్ పని మీద బయటకు వెళ్లాడని చెప్పింది. అదును చూసుకున్న నినో... ఓమనను, స్వస్తికను కత్తితో పొడిచాడు. వారిద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు.

తిరువనంతపురం

తిరువనంతపురం

అప్పుడే ఇంటికి లిజీష్ వచ్చారు. నినో అతని పైన కూడా దాడి చేశాడు. అతను గాయాలతో బయటపడ్డాడు. తన పైన నినో దాడి చేశాడని లిజీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడి జరిగినప్పుడు అను శాంతి ఆఫీసులో ఉన్నారు.

తిరువనంతపురం

తిరువనంతపురం

అనుశాంతితో జీవితం పంచుకునేందుకు నినో.. ఆమె కుటుంబ సభ్యులను లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు చెప్పారు. అతను ఘటన ప్రాంతం నుండి తప్పించుకునేందుకు అనుశాంతి సాయం చేసింది.

తిరువనంతపురం

తిరువనంతపురం

కాగా, ఈ హత్యాకాండను వారు దోపిడీదారుల పనిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. అందుకోసం ఓమన, స్వస్తికల మెడలో ఉన్న ఆభరణాలను తీసుకు వెళ్లాడు. అయితే, లిజీష్ దాడిలో స్వల్ప గాయాలతో బయట పడటంతో నినో, అనుశాంతిల వ్యవహారం బయటపడింది.

 తిరువనంతపురం

తిరువనంతపురం

అనుశాంతిని కోరుకుంటున్న నినోకు అప్పటికే పెళ్లైంది. అతనుకు నాలుగేళ్ల కూతురు ఉంది. టెక్కీగా పని చేస్తున్న తన భార్యతో కూడా అతను సౌమ్యంగా ఉండేవాడు కాదు.

తిరువనంతపురం

తిరువనంతపురం

అనుశాంతితో నినో వివాహేతర సంబంధం తెలిశాక వారి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. వారు ఓకే ఇంటిలో వేరు వేరు ఫ్లాట్లలో నివసిస్తున్నారు. వారిద్దరికి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు.

English summary
Arrested techi Anu Santhi used WhatsApp application to hatch the murder plot by sending the pictures of the rooms of her house and escape route behind her house to her paramour Nino.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X