వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకి ఎయిమ్స్, కేంద్రం ఓకే: ఏపీకి మెగాఐటీ హబ్‌

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నెలకొల్పేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఒకేచోట 200 ఎకరాల స్థలం ఉండేలా మూడు నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.

ఎయిమ్స్ తరహా ఆసుపత్రి నెలకొల్పేందుకు స్థలం చూడాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి హర్షవర్ధన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ సహా పదకొండు రాష్ట్రాల్లో ఎయిమ్స్ తరహా ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Telangana to get AIIMS like hospital

ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడంతో కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. స్పందించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్.. తెలంగాణలోను ఎయిమ్స్ తరహా బోధనాసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేసీఆర్‌కు తిరుగు లేఖ రాశారు. స్థలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. కేసీఆర్ అధికారులను స్థలాలను ఎంపిక చేయాలని ఆదేశించారు.

ఏపీకి 3 మెగా ఐటీ హబ్‌లు

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో దాదాపు రెండువేల ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ మెగా ఐటీ హబ్‌లను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించింది. ఇందులో రూ.500 కోట్లు ఈ-సేవలు అందించేందుకు వీలుగా పదివేల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వెయ్యి కోట్ల రూపాయల్లో రెండువందల కోట్లు కేంద్రం నుండి వచ్చే అవకాశముంది.

English summary
Union Minister Harsha Vardhan asks KCR for proposals to set up AIIMS like hospital in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X