చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో ఓటులేని టాప్ హీరోయిన్లు, ఓటేసిన రజనీకాంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తం 117 లోకసభ స్థానాలలో ఆరోదశ పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. మొత్తం 2076 మంది అభ్యర్ధుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలనుంది. తమిళనాడులో 39, మహారాష్ట్ర 19, ఉత్తరప్రదేశ్ 12, మధ్యప్రదేశ్ 10, బీహార్లో 7, ఛత్తీస్ గఢ్ 7, పశ్చిమబెంగాల్ 6, అస్సాం 6, రాజస్థాన్ 5, జార్ఖండ్ 4, జమ్మూకాశ్మీర్ 1, పుదుచ్చెరి 1 స్థానాల్లో పోలింగ్ ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 top tamil actresses haven't vote chennai

మరోవైపు తమిళనాడుకు చెందిన టాప్ హీరోయిన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు! తమిళంలో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న పలువురు తమిళ నటులు కారు. వారంతా ఉత్తరాదికి లేదా ముంబైకి చెందిన వారు.

అదే సమయంలో షూటింగులో బిజీగా ఉండటంతో వారు తమతమ సొంత ఊళ్లకు వెళ్లి ఓటు వేస్తారా అనేది చూడాలి. అయితే, ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంది. వారు సెలబ్రెటీలు అయినందున ఒకరికి మార్గం చూపేందుకైనా వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది.

English summary
Most of the top actresses of Tamil cinema haven't vote in Chennai and wont go to their home towns to cast their votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X