వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏటిఎం తెరిచేందుకు యత్నం: పోలీసులకు చిక్కారు

|
Google Oneindia TeluguNews

 Two arrested for attempting to break open ATM in Noida
నోయిడా: ఓ ఏటిఎంను తెరిచి డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను అక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నోయిడాలోని డిఎస్‌సి రోడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తనిఖీల్లో భాగంగా తిరుగుతున్న పోలీసులకు, సెక్యూరిటీ గార్డు లేని స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ బ్యాంకు ఏటిఎంను తెరిచే యత్నం చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఓ ప్రైవేటు యూనివర్సిటీలో కీనర్లుగా పని చేస్తున్న నిందితులు రోహతాష్ చౌహాన్, గుల్షన్ తివారీలు ఛెలెరాలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. వారిద్దరూ గత కొన్ని రోజుల నుంచి సెక్యూరిటీ గార్డులేని ఏటిఎంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం ఈ ఇద్దరు నిందితులు సెక్టార్ 44లోని యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. అది తెరచుకోకపోవడంతో అక్కడ్నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత ఆదివారం డిఎస్‌సి రోడ్‌లోని ఏటిఎంకు సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో ఆ ఏటిఎంను తెరిచేయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో వారు పోలీసులకు పట్టుబడ్డారని డిఎస్పీ రాజ్‌కుమార్ మిశ్రా తెలిపారు. ఓ స్క్రూడైవర్, హమ్మర్‌ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులను పట్టుకుని, ఏటిఎం చోరీని విఫలం చేసిన పోలీసులకు రూ. 5వేలను ఎస్ఎస్సీ ప్రీతిందర్ సింగ్ ప్రకటించారు.

English summary
Two persons have been arrested for allegedly attempting to break open an ATM at DSC road, police said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X