వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో వివాదాస్పద ఫొటోలు: యువకుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: సొషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో వివాదాస్పద ఫొటోలను అప్‌లోడ్ చేసిన నేరం కింద ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉధమ్ సింగ్ నగర్‌లో ఓ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కమ్యూనిటీ లక్ష్యంగా చేసుకుని ఫొటోలను పోస్ట్ చేయడమే కాకుండా, ట్యాగ్ చేసిన లలిత్ కొలియా అనే యువకుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

అతడు పోస్ట్ చేసిన ఫొటోలు ఉత్తరప్రదేశ్‌లోని సహారాపూర్ మత ఘర్షణలకు సంబంధించినవనిగా అధికారులు చెప్పారు. సిద్ధార్థ మాన్యా అనే నకిలీ ఫేస్‌బుక్ ఐడితో ఈ వివాదాస్పద ఫొటోలను పోస్ట్ చేశాడని అధికారులు వెల్లడించారు.

Uttarakhand youth jailed for inflammatory FB pictures

ఈ ఫేస్‌బుక్ పోస్టులపై ఓ వర్గానికి చెందిన కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ నుంచి వాటిని తొలగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపి అడ్రస్‌ను కనుగొని యువకుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారాన్పూర్‌లో శనివారం ఓ భూమి వివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. పలువురు గాయాలపాలయ్యారు.

English summary
A youth was arrested in Udham Singh Nagar of Uttarakhand and sent to jail for posting inflammatory pictures on Facebook, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X