వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రికి బాబు స్వీట్స్: బతుకమ్మతో సోనియా (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప బుధవారం తన జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో జరుపుకున్నారు. ఈ సంగర్భంగా చంద్రబాబు చిన్న రాజప్పకు స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు బుధవారంనాడు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసి బతుకమ్మను ప్రదానం చేశారు. గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది. ఈ సందర్భంగా విహెచ్ సోనియాకు ఆ కానుకను ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను రేపు గురువారం హైదరాబాదులో పెద్ద యెత్తున నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు మహిళా ముఖ్యమంత్రులను, మహిళా ప్రముఖులను, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఆహ్వానించింది. కానీ, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాను ఆహ్వానించలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియాను ఆహ్వానించకపోవడాన్ని కాంగ్రెసు తెలంగాణ నాయకులు తప్పు పడుతున్నారు.

చిన్న రాజప్పకు చంద్రబాబు స్వీట్లు

చిన్న రాజప్పకు చంద్రబాబు స్వీట్లు

జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్పకు లేక్ వ్యూ అతిథి గృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీట్లు తినిపించారు.

చిన్న రాజప్ప జన్మదిన వేడకలు

చిన్న రాజప్ప జన్మదిన వేడకలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప తన జన్మదిన వేడుకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో బుధవారంనాడు జరుపుకున్నారు.

సోనియాకు విహెచ్ బతుకమ్మ

సోనియాకు విహెచ్ బతుకమ్మ

తెలంగాణ ప్రత్యేక సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకల సందర్భంగా విహెచ్ సోనియాకు బతుకమ్మను ప్రదానం చేశారు.

బతుకమ్మతో సోనియా గాంధీ

బతుకమ్మతో సోనియా గాంధీ

వి. హనుమంతరావు ప్రదానం చేసిన బతుకమ్మను చేతుల్లో పట్టుకుని సోనియా గాంధీ తన నివాసంలో ఇలా కనిపించారు.

English summary

 Chinna Rajappa, Minister for Home is seen celebrating his birthday in presence of Sri N. Chandrababu Naidu, Hon’ble Chief Minister of AP at Lake View Guest House
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X