వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళకు శీలపరీక్ష: కాలుతున్న ఇనుపరాడ్లతో..

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman forced to prove 'chastity' by holding red-hot iron rods
ఇండోర్: తన భర్తతో కలిసి జీవించాలంటే శీలపరీక్షకు సిద్ధపడాలంటూ కమ్యూనిటీ పంచాయతీ ఎదుట ఓ మహిళతో కాలుతున్న ఇనుప రాడ్లను ఓ మహిళ చేతులతో పట్టాలని ఆదేశించారు. ఇందుకుగాను మహిళ భర్త, అత్తలపై కేసుల నమోదుకు స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆ విషయంపై పూనమ్ (25) ఫిర్యాదు చేయడంతో ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రేఖ చంద్రవంశీ ఆ ఆదేశాలు జారీ చేశారు. మహిళ భర్త కునాల్ ఓట్కార్, అత్త తార, వారి సన్నిహిత బంధువు లీలా, ఆమె కుమారుడు సందీప్‌లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె న్యాయవాది సంతోష్ ఖోవారె చెప్పారు.

ఫిర్యాదు చేసిన మహిళ కంజర్ కమ్యూనిటీకి చెందింది. ఆమె 2007 డిసెంబర్ 13వ తేదీన వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంత కాలానికి ఆమె భర్త, ఆమె అత్త వరకట్నంగా 2 లక్షల రూపాయలు వరకట్నంగా డిమాండ్ చేశారు.

అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా హింసిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ఆమె శీలాన్ని అనుమానించి, అగ్నిపరీక్షకు సిద్ధపడాలని చెప్పారు. అందుకు ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు నిరాకరించడంతో సాంఘిక బహహిష్కరించారు.

కమ్యూనిటీపై పూనమ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని మధ్యప్రదేశ్ కంజర్ కమ్యూనిటీ హెడ్ శశి ఖతాబియా చెప్పారు. ఆ సంఘటనతో తమకు సంబంధం లేదని చెప్పారు.

English summary
A local court ordered registration of cases against four people, including a woman's husband and mother-in-law, for allegedly forcing her to "prove" her "chastity" in front of a community panchayat by holding red-hot iron rods, if she wanted to live with her husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X