వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతస్వేచ్ఛపై మోడీతో: కవరేజ్‌పై మార్చేసిన మీడియా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ సందర్భంగా భారత్‌లోని మతస్వేచ్ఛ గురించి మాట్లాడాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆ దేశానికి చెందిన 11 మంది కాంగ్రెస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. మోడీతో సమావేశమైనప్పుడు భారత్‌లో సర్వమత సమానత్వం, మైనార్టీల రక్షణ గురించి మాట్లాడాలని ఒబామాకు రాసిన లేఖలో వారు పేర్కొన్నారు.

ఈ నెల 27న వారు లేఖ రాశారు.ఈ లేఖను 'ఊచకోత వ్యతిరేక కూటమి' సంస్థ తాజాగా విలేకరులకు విడుదల చేసింది. అతివాదులను విమర్శించడం, దేశంలో మైనార్టీలను లక్ష్యంగా చేసుకునే హింస గురించి చర్చకు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రధానమంత్రి మోడీ నిర్మాణాత్మక పాత్రను పోషించవచ్చునని వారు వివరించారు.

11 senators write letter to Obama

ఈ లేఖ పైన సంతకం పెట్టిన కాంగ్రెస్ సభ్యులలో కైథ్ ఎల్లిసన్, జోసెఫ్ పిట్స్, బెట్టీ మెక్ కాలమ్, జిమ్ సెన్సెస్ బ్రెన్నర్, జేర్డ్ పొలిన్, ట్రెంట్ ఫ్రాంక్స్, జేమ్స్ మెక్ గవర్నర్, రష్ హోల్ట్, జాన్ కన్వెయర్స్, బార్బరా ల, రౌల్ ఎంగ్రిజ్వాలా ఉన్నారు.

మోడీ పర్యనటకు భారీ కవరేజ్

మోడీ మాడిసన్ స్క్వేర్ గార్డెన్ (ఎంఎస్జీ)లో చేసిన అద్భుత ప్రసంగం, భారతీయుల ఆనందం తదితర పరిణామానాలన్నింటికీ అమెరికా మీడియా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. విస్తృతంగా కవర్ చేసింది. మోడీ పర్యటనకు ముందు అంతంతమాత్రంగా ప్రధాన్యతనిచ్చిన మీడియా... మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆయనకు లభించిన ఆదరణ తర్వాత ప్రాధామ్యాలను మార్చేసింది. అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి అంశాన్ని ప్రధాన పత్రికలు ప్రచురించాయి. ఎలక్ట్రానికి మీడియా భారీ కవరేజ్ ఇచ్చింది.

English summary
11 Congress senators write letter to Barack Obama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X