వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు: 13 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌తో 12 ఏళ్లకే తల్లి

By Pratap
|
Google Oneindia TeluguNews

12-year old girl becomes UK's youngest mother
లండన్: బ్రిటన్ రాజధాని లండన్‌లో 13 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్‌తో 12 ఏళ్ల బాలిక తల్లి అయింది. వారు కూతురిని కన్నారు. గర్భవతి అయినప్పుడు బాలిక ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. ఆమె వారాంతంలో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతున్నారు.

తల్లీదండ్రులు ఉత్తర లండన్‌కు చెందినవారు. తమ కూతురు ఫొటోను తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. కుటుంబంగా తాము కలిసి ఉంటామని వారు ప్రతిన బూనారని ది మిర్రర్ రాసింది. న్యాయపరమైన విషయాల కారణంగా తల్లి పేరు బయటకు చెప్పడం లేదు.

అతి పిన్నవయస్సులో తల్లి అయిన రికార్డును ఆ బాలిక సృష్టించింది. అంతకు పిన్న వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బాలిక ఈమె కన్నా ఐదు నెలలు పెద్దది. ఆ బాలిక తల్లి కూడా అతి పిన్నవయస్సులో అమ్మమ్మగా మారి రికార్డు సృష్టించింది.

పిన్న వయస్సు గల బాలిక, బాలుడు గత ఏడాది కాలంగా సంబంధం కొనసాగిస్తూ వస్తున్నారు. వారిద్దరు కలిసి ఉండి కూతురుని పెంచాలని భావిస్తున్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ద సన్ రాసింది. బాలిక తల్లిదండ్రులు వారికి మద్దతు ఇస్తున్నారు.

గతంలో 2006లో ఎడిన్‌బర్గ్‌లో 12 ఏళ్ల ఎనిమిది నెలల వయస్సు గల త్రెసా మిడిల్‌టన్ పిన్న వయస్సులో తల్లి అయిన రికార్డును బ్రిటన్‌లో సృష్టించింది. పెరూలోని టిక్రాపోకు చెందిన లీనా మెడినా 1939లో మగబిడ్డకు జన్మనిచ్చి ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో తల్లి అయిన చరిత్ర సృష్టించింది. తల్లి అయినప్పుడు ఆమె వయస్సు ఐదేళ్ల ఏడు నెలలు.

English summary
A 12-year-old girl and her13-year-old boyfriend have become the youngest parents in UK following the birth of their baby daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X