వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కామెరూన్ ఉపప్రధాని భార్యను ఎత్తుకెళ్లిన ఉగ్రవాదులు

|
Google Oneindia TeluguNews

Cameroon vice PM's wife Amadou Ali kidnapped by Boko Haram
యౌందే: బోకో హరామ్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే నైజీరియాలో తమ కార్యకలాపాలతో అట్టుడికించిన ఈ ఉగ్రవాదులు ఇప్పుడు.. పొరుగు దేశమైన కామెరూన్‌పై దృష్టి సారించారు. ఆ దేశంలో హింసకు పాల్పడుతూ అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలోని ఇరుగుపొరుగు దేశాలైన ఈ నైజిరియా, కామెరూన్‌లలో ఉగ్రవాదులు తమ దాడులను ఉధృతం చేశారు.

అంతేగాక, ఏకంగా ఆ దేశ ఉప ప్రధాని అమదై అలీ ఇంటిపై దాడి చేసి ఆయన భార్యను అపహరించుకుపోయారు. నగర మేయర్‌ను అపహరించుకుపోయారు. ఉగ్రవాదులు చేసిన దాడిలో పది మంది పౌరులు చనిపోయినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

మరో ఘటనలో ఓ మత బోధకుడు, లమిడోగా ప్రసిద్ధి చెందిన సెయినీ బౌకర్‌ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాది సంస్థ అయిన బోకారో హరామ్ ఉగ్రవాదులు గత ఏప్రిల్‌లో ఉత్తర నైజిరియాలోని చిబోక్‌లో సుమారు 200 మంది పాఠశాలల బాలికలను అపహరించారు.

గత జూన్‌లో అబుజాలో బాంబుదాడులకు పాల్పడిన ఈ ఉగ్రవాదులు 21మంది ప్రజల ప్రాణాలను బలిగొన్నారు. నైజిరియా, ఉత్తర కామెరూన్, నైజర్ ప్రాంతాల్లో బోకా హరామ్ తన స్థావరాలను ఏర్పరచుకుంది. ఇప్పటికే అమెరికా, యున్ సెక్యూరిటీ కౌన్సిల్.. బోకో హరామ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి.

English summary
Boko Haram militants have abducted the wife of Cameroon's Vice Prime Minister Amadou Ali in an attack Sunday, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X