వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్నాలజీతో విసిగిపోయి ఓ మహిళ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Deadly Tech-World: Feb up with computer, emails, woman commits suicide
లండన్: టెక్నాలజీ వెనక ప్రపంచమంతా పరుగులు తీస్తుంటే ఓ మహిళ దాంతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంది. శాస్త్ర, సాంకేతిక విజ్ఝానంతో విసిగిపోయిన ఓ మహిళ తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం ప్రకారమే 89 ఏళ్ల అన్నీ ఆత్మహత్య చేసుకుంది.

ఈ మెయిల్స్, టీవీలు, కంప్యూటర్స్, సూపర్ మార్కెట్ రెడీమేడ్ మీల్స్‌ వంటి వాటితో మహిళ తీవ్రంగా విసుగు చెందినట్లు తెలుస్తోంది. మరణానికి ముందు ఆమె ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చిది. రాయల్ నేవీ ఇంజనీర్ అయిన మాజీ ఆర్ట్ టీచర్ అన్నీ ప్రపంచ ప్రవాహానికి ఎదురీదడం సరిపోయిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.

తను సంపూర్ణ జీవితాన్ని అనుభవించానని, తన జీవితంలో సాహసాలు, విస్తృతమైన స్వేచ్ఛ ఉన్నాయని ఆమె చెప్పింది. ఆస్పత్రిలో, నర్సింగ్ హోమ్‌లో సుదీర్ఘంగా గడపడంతో ఆమె జీవితం పట్ల విసిగిపోయినట్లు ఉంది.

మరణించిన సమయంలో ససెక్స్‌కు చెందిన అన్నీ అనారోగ్యంతో గానీ వికలత్వం గానీ బాధపడలేదని చెబుతున్నారు. మార్చి 27వ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకుంది.

English summary
hen the entire world is running behind technology, science, a woman decided to end her life after being unable to cope up with this modern world. 89-year-old Anne committed suicide as she had become fed up with emails, TVs, computers and supermarket ready meals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X