వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్ గొడవ: ఫ్రెండ్‌కు అమ్మాయి 65 కత్తిపోట్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Girl stabs friend 65 times following Facebook dispute
లండన్: ఫేస్‌బుక్ వివాదం అత్యంత కిరాతకరమైన, భయంకరమైన పరిస్థితికి దారి తీసింది. ఫేస్‌బుక్ వివాదంలో తీవ్ర ఆగ్రహానికి గురైన 16 ఏళ్ల అమ్మాయి తన ఫ్రెండ్‌ను 65 సార్లు కత్తితో పొడిచి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి.

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో నగ్నంగా ఉన్న తమ ఇద్దరి ఫోటోలను పోస్టు చేసినట్లు గుర్తించిన ఎరాండి ఎలిజబెత్ గుటిర్రెజ్ ఆగ్రహానికి గురై ఫ్రెండ్ అనెల్ బయేజ్‌పై కత్తితో దాడి చేసింది. ఈ ఏడాది చివరి వరకు తాను బతికి ఉండడం అదృష్టమేనని గుటిరెజ్ బయేజ్‌తో అన్నట్లు ది మెట్రో రాసింది.

తాను మౌనంగా ఉన్నట్లు అనిపిస్తుండవచ్చు గానీ నిన్ను మూడుసార్లు చంపాలని తనకు అనిపిస్తోందని గుటిరెజ్ ట్వీట్ చేసింది. ఆమె హెచ్చరికలకు బయేజ్ నవ్వేసినట్లు, సర్దుబాటు చేసుకోవడానికి తన స్నేహితురాలిని మెక్సికోలోని గౌముచిల్‌లో గల తన ఇంటికి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, గుటెరెజ్ బయేజ్‌ను 65 సార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు చెప్పారు. హత్య చేసిన తర్వాత రక్తాన్ని తన దుస్తులతో తుడిచేయడానికి ప్రయత్నించింది. అక్కడి నుంచి పారిపోయి గుటరెజ్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. తన బెస్ట్ ఫ్రెండ్ అంత్యక్రియల రోజు ఆమె అరెస్టయింది.

English summary
In a horrific attack, a 16-year-old girl allegedly murdered her best friend by stabbing her in the back 65 times after she was outraged over a Facebook dispute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X