వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనీమూన్ హత్య: దక్షిణాఫ్రికాకు దేవాని అప్పగింత

|
Google Oneindia TeluguNews

Honeymoon murder: Indian-origin Shrien Dewani extradited to South Africa
లండన్: దక్షిణాఫ్రికాకు హనీమూన్‌‌కు తీసుకువెళ్లి అక్కడ తన భార్యను హత్య చేసిన కేసులో బ్రిటన్‌లో నివాసముంటున్న భారతీయ వ్యాపారవేత్త ష్రీన్ ప్రకాశ్ దేవాని(34)ని విచారణ నిమిత్తం పోలీసులు దక్షిణాఫ్రికాకు తరలించారు. 2010లో ఇండో-స్వీడిష్ మహిళ అన్నీ(28)ని వివాహం చేసుకున్న దేవాని.. హనీమూన్‌కు దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లి అక్కడే హత్య చేశాడు. అయితే తాను తన భార్యను హత్య చేయలేదని దేవాని అంటున్నాడు. కాగా, దేవానిని దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరానికి తరలించారు.

సోమవారం నిందితుడు ష్రీన్‌ను కేప్‌టౌన్‌కు తరలించినట్లు స్కాట్లాండ్ నేర విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. అన్నీ హత్య జరిగిన అనంతరం డిసెంబర్ 7, 2010లోనే దక్షిణాఫ్రికా పోలీసులు ష్రీన్ దేవానిని అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్లపాటు కొనసాగిన విచారణ అనంతరం త్వరలోనే దేవానిని కోర్టులో ప్రవేశపట్టనున్నారు. ఇది ఇలా ఉండగా తన క్లైంట్ అయిన దేవానికి మానసిక పరిస్థితి సరిగా లేదని అతన్ని ప్రస్తుతం కోర్టులో హాజరుపర్చడం సరికాదని అతని తరపు న్యాయవాది అంటున్నారు.

ప్రస్తుతం దేవానికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని ఆయన తెలిపారు. అయితే 18 నెలలపాటు అతనికి చికిత్స చేసిన అనంతరం దక్షిణాఫ్రికాకు అతన్ని అప్పగించాలని ముందే ఒప్పందం జరగడంతో అతన్ని దక్షిణాఫ్రికాకు తరలించారు ఇక్కడి అధికారులు.

కాగా, దేవాని గే అని వార్తలు కూడా వచ్చాయి. తన భార్య హత్యకు ఇదే కారణమై ఉండవచ్చునని పోలీసులు భావించి విచారణ జరిపారు. ఇది ఇలా ఉండగా కేప్‌టౌన్‌లో అన్నీ చనిపోకముందు, తన భర్త ఒక రాక్షసుడని త్వరలో తాను విడాకులు కోరనున్నానని దగ్గరి బంధువులకు అన్నీ మెయిల్ చేసింది. బ్రిస్టల్‌లో ఒక వ్యాపారి అయిన ష్రీన్ దేవాని 'గే' జీవితం గడిపినట్లు దక్షిణ ఆఫ్రికా పోలీసులు నిర్ధారించుకున్నారు. విడాకులు తీసుకుంటానన్న తన భార్యను చంపమని కూడా వ్యక్తులను పెట్టినట్లు తెలిపారు.

స్వలింగ సంపర్కం కోసం ఒక కుర్రాడికి మనీ యిచ్చాడన్న పోలీసుల కథనాన్ని'హాస్యాస్పదంగా" కొట్టిపారేశాడు దేవాని. అయితే, దేవానికిగల మరో 'గే లవర్" తాను దేవానితో సెక్సు జరిపానని పోలీసులకు తెలిపాడు. దేవాని తరచుగా సౌత్ లండన్లోని 'వాక్స్ల్ హాల్ గే క్లబ్" ను సందర్శిస్తూంటాడని, ఈ క్లబ్ కు వచ్చేవారంతా సెక్సు కోసం రబ్బరు, లెదర్ పరికరాలు ఉపయోగించే టైపని పోలీసులు తమ దర్యాప్తులో వెల్లడించారు.

English summary
UK-based Indian-origin businessman Shrien Dewani has been extradited to South Africa to stand trial for allegedly plotting the 2010 murder of his Indo-Swedish wife while on their honeymoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X