వన్ ఇండియా » తెలుగు » వార్తలు » అంతర్జాతీయం
అంతర్జాతీయ వార్తలు

Muammar Gaddafiలిబియా తిరుగుబాటుదారుల దెబ్బకు పారిపోయిన గడాఫీ

ట్రిపోలీ: లిబియా తిరుగుబాటుదారుల దెబ్బకు గడాఫీ పలాయనం చిత్తగించారు. ఆయన ఎక్కడున్నారనే విషయం తెలియడం లేదు. నాలుగు దశాబ్దాలుగా అధికారం చెలాయిస్తున్న గడాఫీని గద్దె దించడానికి తీవ్రస్థాయిలో పోరాడుతున్న లిబియా తిరుగుబాటుదారులు భారీ ముందడుగు వేశారు. దేశ రాజధాని ట్రిపోలిలోకి చొచ్చుకెళ్లి, నగరంపై పట్టు సాధించారు. ప్రఖ్యాత 'గ్రీన్‌స్క్వేర్‌'ను హస్తగతం చేసుకుని 'అమరవీరుల చౌరసా'గా పేరుపెట్టారు. అక్కడ
Pakistan Flagపాకిస్తాన్‌ మసీదు బాంబు దాడిలో 40 మంది మృతి

పెషావర్: పాకిస్తాన్‌లోని ఓ మసీదుపై జరిగిన బాంబు దాడి సంఘటనలో 40 మంది మరణించారు. మరో 85 మంది దాకా గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఈ దాడి జరగడంతో మరణాలు ఎక్కువగా సంభవించాయి. ఇది ఆత్మాహుతి దాడి అనడానికి ఆధారాలున్నాయని స్థానిక పాలనాధికారి ఫజల్ ఖాన్ చెప్పారు. రంజాన్ మాసం సందర్భంగా దాదాపు 300 మంది
Bruce Lee‘బ్రూస్లీ’ ధరించిన కోటుకు 77వేల డాలర్లు..!!

హాంకాంగ్: మార్షల్ ఆర్ట్స్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కుంగ్ ఫూ స్టార్ ‘బ్రూస్లీ’ తన చివరి సినిమా ‘గేమ్ ఆఫ్ ది డెత్’‌లో ధరించిన నీలం రంగు కోటు వేలంలో 77 వేల డాలర్లకు అమ్మకానికి పోయింది. తాము ముందుగా వేసుకున్న అంచనాలకంటే పెద్ద మొత్తంలో వేలం ధర పలకడంతో నిర్వాహకుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అయితే
London Riotsసోషల్ నెట్ వర్కింగ్ సైట్లే ఆయుధాలుగా పేట్రేగిన ‘లండన్ రైట్లు’..!!

లండన్: లండన్ అల్లర్లలో సాంకేతిక పరిజ్ఞానం కీలకపాత్ర పోషించిందని పోలీసులు పేర్కొంటు న్నారు. ఆధునిక టెక్నాలజీ గల బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్లు, ట్విట్టర్, తదితర సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల సమన్వయంతో ఆందోళణకారులు సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ దాడులకు పూనుకున్నారని తెలుస్తోంది. మార్క్ దుగ్గన్ అనే వ్యక్తిని పోలీసులు కాల్చిచంపడాన్ని నిరసిస్తూ ప్రారంభమైన ఆందోళణలు, అల్లర్లకు దారితీశాయి.
USAఅమెరికాలోని కొలంబస్‌లో తెలుగు వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్: అమెరికాలో ఓ తెలుగు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రశాంత్ రెడ్డి సూరి అనే వ్యక్తి ఇండియానాపోలిస్‌లోని కొలంబస్‌లో గల ఓ ఆపార్టుమెంటులో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతినిధులు తెలిపారు. ఆగస్టు 5వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రశాంత్ రెడ్డి కుటుంబం హైదరాబాదులోని
London Riotమండుతున్న బ్రిటన్, ఇతర నగరాలకు లండన్ అల్లర్లు

లండన్: గత నాలుగు రోజులుగా లండన్ నగరం హింస, లూటీలతో అట్టుడికిపోతోంది. లండన్‌లో ప్రారంభమైన అల్లర్లు మరో మూడు ప్రధాన నగరాలకు కూడా వ్యాపించాయి. బ్రిటన్‌లో 1980 తర్వాత ఇంతటి అల్లర్లు చెలరేగడం ఇదే ప్రథమం. అల్లరి మూకలు లండన్‌లో భవనాలకు, వాహనాలకు, చెత్త కుప్పలకు నిప్పు అంటిస్తూ వెళ్లిపోయారు. పోలీసు అధికారులపైకి బాటిళ్లు, ఫైర్ వర్క్స్
Kuwait Mapకువైట్‌లో ముగ్గురు తెలుగువారి కాల్చివేత

హైదరాబాద్: కువైట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురిని ఓ పోలీసు అధికారి కాల్చి చంపాడు. రంజాన్ ఉపవాసాల తొలి రోజు గత సోమవారం ఓ అధికారి కువైట్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు జరిపి నలుగురిని కాల్చి చంపాడు. ఈ సంఘటనలో నలుగురు భారతీయులు మరణించినట్లు భారత దౌత్య కార్యాలయం శుక్రవారం ధ్రువీకరించింది. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు వారిని
Barack Obamaఒబామాకు ఊరట, రుణ పరిమితి ఒప్పందం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఊరట లభించింది. దివాళా తీసే పరిస్థితి నుంచి ఉభయసభల సభ్యులు ఆయనను బయటపడేశారు. రుణ పరిమితి పెంచేందుకు ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. లోటును భర్తీ చేసేందుకు ఆయనకు అవకాశం చిక్కింది. ఇరు పార్టీల నాయకులు ఉభయ సభలకు చెందిన సభ్యులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు
Barack Obamaబిల్లు కోసం అమెరికా అధ్యక్షుడు ఒబామా తిప్పలు!

ఆగస్టు 2వ తేదిన రుణ సేకరణ గరిష్ట పరిమితి బిల్లు కోసం గడువు దగ్గర పడుతోంది. దీంతో అమెరికా ప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ విషయం కేవలం అమెరికానే కాదు. ప్రపంచ దేశాలన్నీ ఈ అంశంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నాయి. దివాలా కాకుండా బయట పడేందుకు సహకరించాలని మార్గాలు అన్వేషించాలని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా విజ్ఞప్తుల
Beware of Visa Fraud ringsవీసా మోసాల ముఠాలతో జాగ్రత్త అంటున్న అమెరికా!

మోసపూరిత వీసాలు ఏర్పాటు చేసే ముఠాలతోను, నకిలీ డాక్యుమెంట్లందించే వ్యక్తులతోను భారతీయ విద్యార్ధులు జాగ్రత్త వహించాలని అమెరికా హెచ్చరించింది. వీసాలకు సంబంధించి మరో అమెరికా యూనివర్శిటీపై తాజాగా దాడి చేసిన సందర్భంలో అమెరికా ఈ హెచ్చరికను జారీ చేసింది. మరో యూనివర్శటీ కూడా ప్రభుత్వ పరిశీలనలో వుంది. విద్యార్ధుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని అమెరికాలో విద్య
More: 1  2  3  4  5  6  7  8  9  10  Next