అంతర్జాతీయ వార్తలు
ఒకే రాత్రి ఎనిమిది మంది స్త్రీలతో బెర్లుస్కోనీ సెక్స్లండన్: జల్సా పురుషుడిగా పేరు పొందిన ఇటలీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ చిక్కుల్లో పడ్డారు. తాను ఒకే రాత్రి ఎనిమిది మంది మహిళలతో పడుకున్నట్లు బ్రోకర్ టారాంటినీతో 74 బెర్లుస్కోనీ మాట్లాడిన టేపులను స్థానిక మీడియా బయటపెట్టింది. మొదటి సారి తాను మహిళలకు డబ్బులు ఇచ్చినట్లు బార్లోస్కోనీ అంగీకరించినట్లు ఆ సంభాషణ వల్ల తెలుస్తోంది. ఆ రాత్రి
విశ్వసుందరిగా మిస్ అంగోలా లైలా లోపెజ్బ్రెజిల్: మిస్ అంగోలా విశ్వసుందరిగా ఎన్నికైంది. మిస్ యూనివర్స్ - 2011 టైటిల్‌ను మిస్ అంగోలా లైలా లోపెజ్ దక్కించుకుంది. బ్రెజిల్‌లోని సావోపౌలోలో జరిగిన ఈ పోటీలు చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగాయి. పోటాపోటీగా నిలిచిన వివిధ దేశాల సుందరీమణులను తోసిరాజని లైలా లోపెజ్ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు మిస్ అంగోలా
టాప్ టెన్‌లో లేని వాసుకి, మిస్ యూనివర్స్‌లో నిరాశముంబై: బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరం వేదికగా జరగనున్న మిస్ యూనివర్స్ పోటీలలో భారత్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వాసుకి సుంకవల్లికి టాప్ టెన్‌లో చోటు దక్కలేదు. దీంతో ఆమె మిస్ యూనివర్స్ పోటీలలో నిరాశ ఎదురయింది. మిస్ యూనివర్స్ పోటీలలో పాల్గొన్న వారు ఎస్మెమ్మెస్, ఈ-మెయిల్ ద్వారా టాప్ టెన్‌లో చోటు దక్కించుకోవాల్సి ఉంటుంది.
అమెరికాకు సెప్టెంబర్ 11 టెన్షన్, చొరబడ్డ ముగ్గురువాషింగ్టన్: పదేళ్ల క్రితం సెప్టెంబర్ 11వ తేదీన అమెరికా వణికి పోయింది. ఉగ్రవాద దాడితో జంట శిఖరాలు నేలమట్టమయ్యాయి. ఆ టెన్షన్ అమెరికాను ఇప్పుడు కూడా పట్టుకుంది. సెప్టెంబర్ 11 ఆదివారం నాటికి దాడికి సరిగ్గా పదేళ్లు అయిన సమయంలోఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక అమెరికా దడదడలాడుతోంది. ముగ్గురు దుండగుల కోసం అమెరికా పోలీసులు అణువణువునా
రష్యాలో విమానం కూలి 43 మంది దుర్మరణంమాస్కో: రష్యాలోని మాస్కో సమీపంలో బుధవారం సాయంత్రం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ విమాన ప్రమాదంలో 43 మంది మరణించారు. బెలారస్ వెళుతుండగా మాస్కోకు 200 కి.మీ దూరంలో ఈ విమానం కుప్పకూలింది. దీనిలో ప్రయాణిస్తున్న రష్యా, జర్మనీ, స్వీడన్ దేశాలకు చెందిన ఐస్ హాకీ ఆటగాళ్లు
అమెరికా దౌత్య రహస్యాల గుట్టురట్టు చేసిన వికీలీక్స్లండన్: అగ్రరాజ్యం అమెరికా రహస్యాలను బట్టబయలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్న వికీలీక్స్ వెబ్‌సైట్ తాజాగా మరో బాంబు పేల్చింది. అమెరికాకు చెందిన 2.50 లక్షల దౌత్యపరమైన రహస్య కేబుల్స్(పత్రాలు)ను ఇంటర్‌నెట్‌లో ఉంచినట్లు శుక్రవారం ప్రకటించింది. అమెరికాకు ముందుగా చెప్పి మరీ ఈ కేబుల్స్‌ను విడుదల చేసిన వికీలీక్స్ ఆ దేశం, హక్కుల సంఘాలు, మీడియా మిత్రుల హెచ్చరికలను
గడాఫీ తనయుడు హతం, తలదాచుకున్న భార్యట్రిపోలీ: లిబియా నేత ముమ్మార్ గడాఫీ కుమారుడు ఖమీస్ గడాఫీని హతమార్చామని లిబియా తిరుగుబాటుదారులు ప్రకటించారు. దక్షిణ ట్రిపోలికి 80 కిలోమీటర్ల దూరంలోని ఒక నగరంలో ఖమీస్‌ను చంపేశామని తిరుగుబాటు నేనల నాయకుడు ఒకరు తనకు తెలిపారని మానవ హక్కుల మంత్రి మహమ్మద్ అల్ అలగె తెలిపారు. ఖమీస్ అంత్యక్రియలు పూర్తి చేసేసినట్లు వెల్లడించారని ఆయన పేర్కొన్నారు.
అల్జీరియా సరిహద్దుకు పారిపోయిన గడాఫీ?ట్రిపోలి: లిబియా అధ్యక్షుడు ముమ్మార్ గడాఫీ దేశం నుండి పారిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆరు సాయుధ కార్లలో లిబియన్ అధికారులు గడాఫీని అల్జీరియాకు తీసుకు పోయినట్లుగా ఈజిప్టియన్ వార్తా సంస్థ ఒకటి తెలిపింది. అల్జీరియాలోని ఘడేమ్స్ నగరంలోకి వెళ్లే వరకు ప్రభుత్వ అనుకూల దళాలు ఆ వాహనాలకు రక్షణగా నిలిచినట్లు సమాచారం. అయితే తిరుగుబాటుదారుల దగ్గర సరైన
సింగపూర్ అధ్యక్షుడిగా టోనీ ట్యాన్ కెంగ్ యామ్సింగపూర్ అధ్యక్షుడిగా మాజీ ఉప ప్రధాన మంత్రి, అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ అభ్యర్థి టోనీ ట్యాన్ కెంగ్ యామ్ ఎన్నికయ్యారు. సింగపూర్‌కు ఈయన ఏడవ అధ్యక్షుడు. శనివారం అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై ఏడువేలకు పైగా మెజార్టీతో గెలుపు పొందారు. అధ్యక్ష పీఠం కోసం మొత్తం నలుగురు పోటీ
బెర్ముడా విమానాశ్రయంలో దుస్తులిప్పేసిన మహిళలండన్: బెర్ముడా విమానాశ్రయంలో ఓ మహిళ అందరూ చూస్తుండగా దుస్తులిప్పేసి నగ్నంగా నిలబడింది. కస్టమ్స్ అధికారులు లగేజి తనిఖీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆమె ఈ దిగ్భ్రాంతికరమైన చర్యకు పాల్పడింది. చుట్టుపక్కల అందరూ చూస్తుండగా ఆమె ఈ పనికి ఒడిగట్టినట్లు డైలీ మెయిల్ పత్రిక రాసింది. తనను నగ్నంగా చూడదలుచుకుంటే ఇప్పుడే చూడండంటూ ఆమె బట్టలు విప్పేసింది.