వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో పెట్టుబడులు, విద్యార్దులతో ముచ్చట్లు: మోడీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్ పర్యటనలో భాగంగా నాల్గవ రోజు ప్రధాని నరేంద్ర మోడీ బిజీబిజీగా గడిపారు. అక్కడున్న పారిశ్రామిక వేత్తలతో టోక్యోలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు భారత్ కన్నా ఉత్తమమైన దేశం ఏదీ లేదన్నారు.

ఇటీవల రక్షణ సహా అన్ని రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. జపాన్‌లో పదేళ్ళలో మీరు సాధించిన అధ్బుతాన్ని రెండేళ్లలో భారత్‌లో ఆవిష్కరించవచ్చునని పారిశ్రమికవేత్తలను కోరారు. ఇప్పుడు భారత్ అవకాశాల స్వర్గం, రండి కలిసి పనిచేద్దామని జపాన్ పారిశ్రమికవేత్తలను కోరారు.

 India committed to peace: Narendra Modi

గత రెండున్నర, మూడేళ్లుగా చేయలేని పనిని వందరోజుల్లో చేసి చూపించామన్నారు. ఎలక్రికల్, ఎలక్ట్రానిక్స్, లోకో మోటివ్ సహా వందల రంగాల్లో ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయన్నారు. అటల్ బీహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో భారత్, జపాన్‌ల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయన్నారు. ఆసియాను బలోపేతం చేసేందుకు చేయి చేయి కలుపుదామని నరేంద్ర మోడీ సూచించారు.

జపాన్ విద్యార్దులనుద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోడీ

మంగళవారం ఉదయం టోక్యోలని సెక్రెడ్ హాట్ విశ్యవిద్యాలయంలో జపాన్ విద్యార్దులనుద్దేశించి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో కలిసి పురోగతి సాధిద్దామని నరేంద్ర మోడీ విద్యార్దులకు పిలుపునిచ్చారు.

ఇతరుల గురించి ఆలోచించకుండా మన గురించి మనం ఆలోచిద్దామని.. నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలను సమ్మిళితం చేయాలని విద్యార్దులకు సూచించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మాయిల విద్యకు కృషి చేసినట్లు వెల్లడించారు.

భారత్‌లో ప్రకృతిని భగవంతుడితో సమానంగా ఆరాధిస్తామని, ప్రకృతిని దోచుకోవడం నేరమని పిల్లలకు నేర్పిస్తామన్నారు. మన అలవాట్లు వల్లే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రకృతితో భారతీయులకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఈ సందర్బంగా మోడీ గుర్తుచేసుకున్నారు. భారత్ బుద్దుడి ప్రదేశం.. బుద్దుడి మార్గంలోనే అహింసకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జపాన్ విద్యార్దులను మోడీ భారత్‌కు అహ్వానించారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే పాల్గోన్నారు.

English summary
Prime Minister Narendra Modi Tuesday said that India is committed to peace and this commitment has "significance far above any international treaties or processes".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X