వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిజంపై పోరు-సహకారం: ఒబామాతో మోడీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య మంగళవారం జరిగిన శిఖరాగ్ర భేటీ ఇరు దేశాలను అనేక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళ్లేందుకు వీలు కల్పించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో దాదాపు రెండు గంటలపాటు ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరిపారు. పౌర అణు ఇంధన ఒప్పందం అమలుకు సంబంధించి అన్ని అవరోధాలను తొలగించాలన్న అంశాన్ని ప్రస్తావించారు. అలాగే, ఉగ్రవాద నిరోధనకు సంబంధించి కూడా మరింతగా సహకారం పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించడం ద్వారా అన్ని రంగాల్లోను మైత్రీబంధాన్ని ఇనుమడింప చేసుకోవాలని ఒబామా, మోడీలు నిర్ణయించారు. ఆర్థిక సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు సహా అనేక అంశాలు ఈ ఉన్నతస్థాయి భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. అమెరికాలో భారత సేవలకు మరింతగా వెసులుబాటు కల్పించాలని మోడీ ఈ సందర్భంగా కోరారు. రక్షణ సహకార ఒప్పందాన్ని మరో పదేళ్లపాటు పొడిగించాలని నిర్ణయించారు. అనంతరం భారత ఉత్పాదక రంగంలో భారీ పెట్టుబడులతో తరలి రావాలని అమెరికా కంపెనీలకు మోడీ పిలుపునిచ్చారు.

మొదట రెండు దేశాలకూ చెందిన ప్రతినిధుల స్థాయి చర్చలు, అనంతరం పరిమితస్థాయి మంతనాల నేపథ్యంలో ఒబామా, మోడీలు శిఖరాగ్ర సమావేశం అయ్యారు. దక్షిణాసియాలో ఉగ్రవాద సమస్య, పశ్చిమ ఆసియాలో కొత్తగా తలెత్తుతున్న సవాళ్లను ఏవిధంగా ఎదుర్కోవాలన్న దానిపై ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం సంయుక్తంగా మీడియా ముందు హాజరై మాట్లాడారు. భారత్ -అమెరికా సంబంధాలు తన పర్యటన నేపథ్యంలో మరింత వేగంగా ముందుకు వెళ్లగలవన్న ఆశాభావాన్ని నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి అమెరికా సహకారం కోరామని చెప్పారు.

పౌర అణు ఇంధన భాగస్వామ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలని తాము నిర్ణయించామని, అలాగే ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను చిత్తశద్ధితో పరిష్కరించుకోవాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు. భారత దేశ ఇంధన భద్రత అవసరాలను తీర్చడానికి పౌర అణు ఇంధన ఒప్పందం త్వరితగతిన అమలు కావాల్సిన అవసరమని మోడీ ఉద్ఘాటించారు. ఈ చారిత్రక ఒప్పందం మన్మోహన్ సారథ్యంలోని కాంగ్రెస్ హయాంలో ఇరు దేశాల మధ్య కుదిరింది. అయితే, జవాబుదారీ చట్టాలకు సంబంధించిన అంశాలు ప్రతికూలంగా మారడంతో ఆగిపోయింది.

కాగా, అమెరికా మార్కెట్‌లకు భారత సేవా రంగాన్ని అనుసంధానం చేసే చర్యలు చేపట్టాలని, ఇందుకు అన్ని విధాలుగా భారత్ కంపెనీలకు వీలు కల్పించాలని ఒబామాను తాను కోరినట్టుగా మోడీ వెల్లడించారు. అలాగే, భద్రత, రక్షణ అంశాలకు సంబంధించిన చర్చలను కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. భారత రక్షణ ఉత్పాదక రంగ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని అమెరికా రక్షణ కంపెనీలను ఆహ్వానించినట్టు మోడీ వెల్లడించారు. ఇటీవల భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింతగా మార్గం సుగమం చేసి పెట్టుబడుల పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య మంగళవారం జరిగిన శిఖరాగ్ర భేటీ ఇరు దేశాలను అనేక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళ్లేందుకు వీలు కల్పించింది.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో దాదాపు రెండు గంటలపాటు ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరిపారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

పౌర అణు ఇంధన ఒప్పందం అమలుకు సంబంధించి అన్ని అవరోధాలను తొలగించాలన్న అంశాన్ని ప్రస్తావించారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

అలాగే, ఉగ్రవాద నిరోధనకు సంబంధించి కూడా మరింతగా సహకారం పెంపొందించుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించడం ద్వారా అన్ని రంగాల్లోను మైత్రీబంధాన్ని ఇనుమడింప చేసుకోవాలని ఒబామా, మోడీలు నిర్ణయించారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

ఆర్థిక సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు సహా అనేక అంశాలు ఈ ఉన్నతస్థాయి భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. అమెరికాలో భారత సేవలకు మరింతగా వెసులుబాటు కల్పించాలని మోడీ ఈ సందర్భంగా కోరారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

రక్షణ సహకార ఒప్పందాన్ని మరో పదేళ్లపాటు పొడిగించాలని నిర్ణయించారు. అనంతరం భారత ఉత్పాదక రంగంలో భారీ పెట్టుబడులతో తరలి రావాలని అమెరికా కంపెనీలకు మోడీ పిలుపునిచ్చారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

దక్షిణాసియాలో ఉగ్రవాద సమస్య, పశ్చిమ ఆసియాలో కొత్తగా తలెత్తుతున్న సవాళ్లను ఏవిధంగా ఎదుర్కోవాలన్న దానిపై ఇద్దరు నేతలు చర్చించారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

అనంతరం సంయుక్తంగా మీడియా ముందు హాజరై మాట్లాడారు. భారత్ -అమెరికా సంబంధాలు తన పర్యటన నేపథ్యంలో మరింత వేగంగా ముందుకు వెళ్లగలవన్న ఆశాభావాన్ని నరేంద్ర మోడీ వ్యక్తం చేశారు. దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి అమెరికా సహకారం కోరామని చెప్పారు.

మోడీ-ఒబామా

మోడీ-ఒబామా

పౌర అణు ఇంధన భాగస్వామ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలని తాము నిర్ణయించామని, అలాగే ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను చిత్తశద్ధితో పరిష్కరించుకోవాలని కూడా నిర్ణయించినట్లు తెలిపారు.

దక్షిణాసియాలో ఉగ్రవాద సమస్య, పశ్చిమ ఆసియాలో ఎదురవుతున్న సవాళ్లను ముఖ్యంగా ఐఎస్‌ఐఎస్, జిహాదీ మూకలు చెలరేగిపోవడాన్ని ప్రస్తావించిన నరేంద్ర మోడీ, ఉగ్రవాద నిరోధన అలాగే ఇంటెలిజెన్స్ సమాచారం పంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలని భారత్ -అమెరికాలు నిర్ణయించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఒబామా మాట్లాడుతూ.. దక్షిణాసియా ప్రాంత శాంతి భద్రతలకు సంబంధించి భారత్ ప్రధాన శక్తిగా ఎదుగుతోందని వెల్లడించారు. అలాగే, ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించిన అంశాలపై కూడా తమ మధ్య సుహృద్భావ రీతిలో చర్చలు జరిగాయని ఒబామా వెల్లడించారు. డబ్ల్యుటివో ఒప్పందాన్ని బలపరుస్తున్నప్పటికీ, ఆహార భద్రతకు సంబంధించిన అంశాలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.

సాధ్యమైనంత త్వరగా ఇందుకో మార్గాంతరం లభించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, భారత్‌తో అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా మైత్రీబంధాన్ని, సహకారాన్ని పెంపొందించుకోగలమన్న నమ్మకం తనకు ఉందని ఒబామా అన్నారు. వాణిజ్య, ఆర్థిక సహకారంతోపాటు రోదసి పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పాలుపంచుకోవడం వంటి ఎన్నో విషయాలపై తాము చర్చించినట్టుగా వెల్లడించారు. అలాగే, అంతార్జాతీయంగా వైద్య పరమైన సవాళ్లను ఎబోలా వంటి జఠిల వ్యాధులను నియంత్రించే విషయంలో కూడా ఇరుదేశాలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కాగా, ఐదు రోజుల అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మనదేశానికి తిరుగు పయనమయ్యారు. బుధవారం రాత్రి 11 గంటలకు మోడీ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

English summary
Prime Minister Narendra Modi and US President Barack Obama Tuesday discussed the issue of terrorism, including in West Asia, and agreed to cooperate in counter-terrorism measures and in intelligence sharing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X