హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికా ఎకానమీకి హైదరాబాద్ విద్యార్థుల బూస్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత విద్యార్థులు చేస్తున్న సేవ గణనీయంగా ఉంది. భారత్, చైనా, దక్షిణ కొరియాల నుంచి వస్తున్న విద్యార్థుల నుంచి అమెరికాకు ట్యూషన్ ఫీజుల రూపంలో 21.8 బిలియన్ డాలర్లు వస్తుండగా, లివింగ్ ఖర్చుల కింద 12.8 బిలియన్ డాలర్లు సమకూరుతున్నాయి.

2008 నుంచి 2012 మధ్య కాలంలో ఆ మూడు దేశాల విద్యార్థులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు అంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చి పెట్టారు. అమెరికాలోని 118 మెట్రో నగరాల్లో ఈ మూడు దేశాల విద్యార్థులు ఉంటున్నారు. ఈ విషయాలు ప్రతిష్టాత్మకమైన బ్రూకింగ్ ఇనిస్టిట్యూట్ నివేదికలో వెల్లడయ్యాయి.

ముంబై, హైదరాబాద్‌ నగరాలకు చెందిన విద్యార్థులు అమెరికా అర్థిక వ్యవస్థకు 1.25 బిలియన్ డాలర్లు సమకూర్చారు. ముంబై నుంచి 17,294 మంది, చెన్నై 9,141 మంది, బెంగళూర్ 8,835 మంది, న్యూఢిల్లీ 8,728 మంది విద్యార్థులను అమెరికాకు ఐదేళ్ల కాలంలో పంపించాయి.

Indian students major contributors to US economy: Report

స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్)ల్లో చేరిన విదేశీ విద్యార్థుల్లో చైనా నుంచి 31 శాతం ఉండగా, భారత్ నుంచి 27 శాతం, దక్షిణ కొరియా నుంచి ఐదు శాతం ఉన్నారు.

అమెరికాలోని విదేశీ స్టెమ్ విద్యార్థులకు సంబంధించి హైదరాబాద్ టాప్ సోర్స్ సిటీగా అమెరికాలోని బ్రూకర్ ఇనిస్టిట్యూట్ నివేదిక గుర్తించింది. ఎఫ్ -1 (స్టూడెంట్ విసా)లకు సంబంధించిన కూడా భారత్ నగరాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పది అమెరికా సోర్స్ సిటీల్లో భారత్ నగరాలే పది ఉన్నాయి.

ఎఫ్ -1 వీసా కింద అమెరికాకు బీజింగ్ నుంచి అత్యధిక విద్యార్థులు వెళ్తుండగా మూడో స్థానాన్ని హైదరాబాద్ ఆక్రమించింది. చైనాలోని బీజింగ్ నుంచి ఎఫ్ - 1 వీసా కింద 49,946 మంది అమెరికాలో ఉండగా, షాంఘై నుంచి 29,145 మంది ఉన్నారు. హైదరాబాద్ నుంచి 26,220 మంది ఉన్నారు. ఖాట్మండ్ జనాభా 70 వేలే అయినప్పటికీ పది అమెరికా సోర్స్ సిటీల్లో స్థానం దక్కించుకుంది. ఖాట్మండ్ నుంచి ఎఫ్-1 వీసా కింద 10,721 మంది విద్యార్థులు అమెరికాలో ఉన్నారు.

English summary
The American think-tank noted that Hyderabad is the top source city of foreign STEM students in the United States and India accounts for eight of the 10 origin cities with the highest shares of their F-1 (student visa) students in STEM fields.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X