వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలోనూ..: యువతి వీపుపై మోడీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత్‌లో మోడీ మానియా కనిపించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు మోడీ ప్రధాని అవుతారని విశ్వాసం అమెరికా, బ్రిటన్.. ఇలా పలుదేశాలు కూడా వ్యక్తం చేశాయి. ఈ కారణంగానే ఆయన పట్ల క్రమంగా అనుకూలత ప్రదర్శించాయి.

ఎన్నికలకు ముందు భారత్‌లో మోడీ టీ పాయింట్లు వెలిసిన విషయం తెలిసిందే. అలాగే, యువత మోడీ టట్టూలతో అలరించారు. అమ్మాయిలు, మహిలలు కూడా మోడీ టట్టూలను వేసుకున్నారు.

ఇప్పుడు మోడీ అమెరికా పర్యటనలోను ప్రవాస భారతీయులు మోడీ పట్ల తమ అభిమానాన్ని చాటుతున్నారు. ప్రవాస భారతీయులు.. మహిళలు, యువత కూడా మోడీ టట్టూలతో అలరిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలోను మోడీ మానియా కనిపిస్తోంది. టట్టూల నుండి ప్లకార్డుల వరకు.. అన్నింటా మోడీ కనిపిస్తున్నారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నరేంద్ర మోడీ టట్టూలతో అమెరికాలో యువతులు ఇలా..

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ఆదివారం ఉదయం న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ప్రవాస భారతీయులను, భారత సంతతి అమెరికన్లను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

అమెరికాలోని భారతీయులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ప్రవాస భారతీయుల కరతాళ ధ్వనుల మధ్య వేదిక వద్దకు చేరుకున్న మోడీ ‘భారత్‌ మాతాకీ జై' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

 నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

దాదాపు 75 నిమిషాల పాటు అక్కడున్న అందరినీ మోడీ మంత్రముగ్ధులను చేసింది. ‘మోడీ.. మోడీ..' అంటూ వారు చేసిన నినాదాలతో మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ మారుమోగిపోయింది.

నరేంద్ర మోడీ

తాను ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ వారిని మరింత ఉత్సాహపరిచేలా ప్రసంగించిన మోడీ ‘భారత్‌ మాతా కీ జై' నినాదంతోనే ప్రసంగాన్ని ముగించారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

కార్యక్రమం చివర్లో భారత జాతీయ పతాకంలో ఉన్న మూడు రంగుల బెలూన్లను ఆడిటోరియం పై భాగం నుంచి కిందికి జారవిడువడంతో కేరింతలు మిన్నుముట్టాయి.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో, మోడీతో కలసి విందు సమావేశంలో పాల్గొనడానికి ఆ దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆఫ్ఘనిస్థాన్ పర్యటననే రద్దు చేసుకున్నారు.

నరేంద్ర మోడీ

సోమవారం ఆఫ్ఘన్ నూతన అధ్యక్షుడిగా అష్రఫ్ ఘనీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆఫ్ఘన్ రాజకీయ సంక్షోభం పరిష్కారంలో కీలక పాత్ర పోషించిన కెర్రీ... ఘనీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సి ఉంది.

నరేంద్ర మోడీ


అయితే, నరేంద్ర మోడీ పర్యటనకు అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో జాన్ కెర్రీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

నరేంద్ర మోడీ

మోడీ ఐక్యరాజ్య సమితి ప్రసంగంలో పాకిస్తాన్‌కు దీటుగా బదులిచ్చారని, కాంగ్రెస్ అధికార ప్రతినిధి శశిథరూర్ అన్నారు. ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

English summary
From tattoo to Placard Narendra Modi is everywhere in US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X