వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్‌ను కొరికాడని 13ఏళ్ల చిన్నారిని కొరికిన మరో టీచర్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని వాషింగ్టన్ శివార్లలోని ఓ ప్రైవేటు ప్రీస్కూల్లో చిన్నారిని కొరికిన టీచర్ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే అంతకుముందు ఆ చిన్నారి మరో టీచర్‌ను కొరకిన నేపథ్యంలో ఈ టీచర్ చిన్నారిని కొరికేసిందని పోలీసులు సోమవారం చెప్పారు.

వివరాల్లోకి వెళితే.. వుడ్‌బ్రిడ్జ్ ప్రాంతంలో ఉన్న గొడ్డార్డ్ పాఠశాలలో 13 నెలల చిన్నారి ప్రీస్కూలింగ్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 11న ఆ చిన్నారి స్కూల్లో ఓ టీచర్‌ను కొరికాడు. దీంతో ఆగ్రహానికి గురైన మరో టీచర్ థెరీసా బ్రౌన్.. ఆ చిన్నారి భుజంపై కొరికేసింది.

Preschool teacher allegedly bit a 13-month-old student after the boy bit another teacher

ఈ ఘటన చూసిన ఓ వ్యక్తి స్కూల్ సహ యజమాని నదియా చౌదరికి సమాచారమందించగా.. ఆమె ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచింది.

అయితే బాలుడిని కొరికిన విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, థెరీసా బ్రైన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె 2000వేల డాలర్ల సెక్యూర్డ్ బాండ్‌పై విడుదలయ్యారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పాఠశాల యాజమన్యం ఆమెను పాఠశాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

English summary
A private pre-school teacher in Woodbridge, Virginia, was charged with assault and battery for allegedly biting a young student in retaliation for the student biting another teacher, police said Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X