వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ భారత్‌లో భాగం కాదు: అస్లాం, తెగబడ్డ పాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Tasnim Aslam
ఇస్లామాబాద్: ఇన్నాళ్లుగా జమ్ము-కాశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొంటూ వస్తున్న పాకిస్థాన్‌ మాట మార్చేసింది. కాశ్మీర్‌ భారత్‌లో భాగం కాదని తెగేసి చెప్పింది. కాశ్మీర్‌లోని హురియత్‌ నాయకులతో భారత్‌లోని పాక్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ చర్చలు జరపడంతో ఆగ్రహించిన భారత్‌ ద్వైపాక్షిక చర్చలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనిపై పాక్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి తస్నిం అస్లాం స్పందించారు.

అబ్దుల్‌ బాసిత్‌ కాశ్మీర్‌ వేర్పాటు వాదులతో మాట్లాడడం భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదని ఆమె వ్యాఖ్యానించారు. భారతదేశానికి పాక్‌ తాబేదారు కాదని, సర్వసత్తాక దేశమని, జమ్ము-కాశ్మీర్‌ వివాదంలో ఒక చట్టబద్ధమైన భాగస్వామి అని చెప్పారు. చర్చల విరమణకు భారత్‌ చెబుతున్న ఈ కారణం ఒక సాకు మాత్రమేనని, తాము హురియత్‌ నేతలతో చర్చలు జరపడం ఇదే మొదటిసారి కాదని అస్లాం అన్నారు.

అదొక వివాదాస్పద భూభాగమని, దానిపై ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌ అంశం ఎంత మాత్రం భారత అంతర్గత సమస్య కాదని, అది ముమ్మాటికీ అంతర్జాతీయ సమస్యేనని వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ షా గిలానీ తేల్చిచెప్పారు. భారత్‌లో పాక్‌ రాయబారి అబ్దుల్‌ బాసిత్‌తో భేటీ అయ్యేందుకు మంగళవారం ఆయన న్యూఢిల్లీ వచ్చారు.

భారత్‌ తీసుకున్న చర్చల రద్దు నిర్ణయం దురదృష్టకరమన్నారు. కాశ్మీర్‌ అంశం తమ అంతర్గత విషయమని భారత్‌ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఆసక్తి చూపని భారత్‌ ఆ సమస్యను మరింత జటిలం చేస్తోందని గిలానీ ఆరోపించారు. శాంతియుత, రాజకీయ తీర్మానంతోనే కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లభించగలదని హురియత్‌ కాన్ఫరెన్స్‌ నేత మిర్వైజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ వ్యాఖ్యానించారు. జమ్ము కాశ్మీర్‌ అధికార, ప్రతిపక్షాలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ నేతలు కూడా కేంద్రంపై విమర్శలు కురిపించారు.

ఈ పరిణామాలపై అగ్రదేశం అమెరికా ఆచితూచి స్పందించింది. అటూ ఇటూ నెలకొన్న పరిస్థితిని దురదృష్ణకరంగా అభివర్ణించింది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్‌-పాక్‌ చేసే ప్రయత్నాలకు ఎప్పటిలాగే మా మద్దతు కొనసాగుతుందని ఒక ప్రకటనలో తెలిపింది.

English summary
Arguing that High Commissioner Abdul Basit did not interfere in India's internal affairs, Pakistan Foreign Office spokesperson Tasnim Aslam claimed that Kashmir was not part of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X