వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిన్‌పింగ్‌తో సరిహద్దుపై ఆందోళన వ్యక్తం చేశా: మోడీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ - చైనాల మధ్య మొత్తం 12 కీలక ఒప్పందాల పైన అవగాహన కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్, ప్రధాని మోడీ భేటీ అయిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. చైనా - భారత్ సరిహద్దులో ఉద్రిక్తల పైన చైనా అధ్యక్షుని ముందు తాను ఆందళన వ్యక్తం చేశానని నరేంద్ర మోడీ తెలిపారు.

ఇరుదేశాల మధ్య వాస్తవాధీన రేఖ పైన చాలాకాలంగా చర్చలు నిలిచిపోయాయని చెప్పారు. సరిహద్దు వద్ద ఉద్రిక్తత తగ్గించుకోవాల్సి ఉందన్నారు. వాణిజ్య, వ్యాపారానికి సంబంధించి ఇరు దేశాల మధ్య ఐదేళ్ల పాటు ఒప్పందం కుదరడం గొప్ప ముందడుగు అన్నారు.

చైనాతో సంబంధాలను గొప్ప అవకాశంగా మలుచుకోవాలన్నారు. సాంస్కృతిక, సామాజికంగా ఇప్పుడు నాగరికత ఎంతో పరిణితి సాధించిందన్నారు. గత రెండు రోజులుగా ఎన్నో విషయాలు మాట్లాడే అవకాశం లభించిందని చెప్పారు. ఇరు దేశాల నిరంతర శిఖరాగ్ర సమావేశాలకు అవకాశం ఏర్పడిందన్నారు.

The border should be peaceful and stable: Modi

భారత్ కంపెనీలకు అమ్మకాలకు, పెట్టుబడులకు చైనాలో అవకాశమివ్వాలని కోరినట్లు తెలిపారు. సంబంధాలతో పాటు అన్ని విషయాలు సమగ్రంగా చర్చించామని మోడీ చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన పైన చర్చించినట్లు తెలిపారు. 12 ఒప్పందాల పైన అవగాహన కుదిరిందన్నారు.

పౌర అణు ఒప్పందం పైన చర్చలు జరుపుతామన్నారు. ఇరు దేశాల మధ్య ఐదేళ్ల పాటు వాణిజ్య, వ్యాపార సంబంధం గొప్ప ముందడుగు అన్నారు. మానస సరోవర్‌లో వర్షాకాలంలోను సురక్షిత రహదారిని ఏర్పాటు చేస్తామన్నారు. నాథులా మీదుగా మానస సరోవర్‌కు చేరుకునేందుకు రహదారి నిర్మిస్తామన్నారు.

వాహనాలు కూడా చేరుకునే విధంగా సురక్షిత మార్గం ఉంటుందన్నారు. విద్యుత్ ఉత్పాదన పైన ఇరు దేశాల మధ్య చర్చలు జరుపుతామన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ, ఇరు దేశాల మధ్య సంబంధాల పైన చర్చించామన్నారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తాను కోరానని తెలిపారు.

English summary
It is necessary to resolve the border row with China, Prime Minister Narendra Modi said on Thursday. He said: "The border (with China) should be peaceful and stable."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X