వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ వీడియో: ప్లేన్ నుండి మాజీ మంత్రి తోసివేత!

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రిని ఒకరిని విమానంలో తోసేసిన ఓ మొబైల్ వీడియో యూట్యూబ్‌లో అప్ లోడ్ అయింది. ఈ ఈ వీడియో ఇంటర్నెట్లో బాగా వ్యాప్తి చెందుతోంది. ఈ వీడియోలో పాకిస్తాన్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్‌ను తోసేసినట్లుగా ఉంది. సమాచారం మేరకు... పాకిస్తానే ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన పీకే 370 విమానం ఇస్లామాబాదుకు వెళ్లాల్సి ఉంది.

Video: Pakistan's ex-interior minister Rehman Malik thrown off a plane

అది కరాచీ నుండి బయలుదేరాలి. అయితే, ఈ విమానం రెండు గంటలు ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ కారణమంటూ పలువురు ప్రయాణీకులు ఆయన పైన దుమ్మెత్తిపోశారు. మరోవైపు, ఎయిర్‌లైన్స్ అధికారులు విమానం ఆలస్యానికి గల కారణాలను చెప్పలేకపోయారు. అయితే, సాంకేతిక సమస్యనే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.

అయితే, మాలిక్ కారణమని పలువురు ఆయనను నిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 53,000 మంది చూశారు. వీడియోలో పలువురు ప్రయాణీకులు మాజీ మంత్రి పైన ఆగ్రహం వెళ్లగక్కారు. ఆయన రాకముందే పలువురు ప్రయాణీకులు మాలిక్ వస్తే నిలదీస్తామని మాట్లాడుకున్నట్లుగా వీడియోలో ఉంది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/qF25VLTBJLQ?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

అనంతరం మాలిక్ విమానం వైపు నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయలో విమానంలోని సిబ్బందిలో ఒకరు మాట్లాడుతూ.. సర్ మీరు వెళ్లే ముందు, ప్రయాణీకులకు క్షమాపణ చెప్పాలని అన్నట్లుగా వీడియోలో ఉంది.

మీ వల్ల 250 మంది ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారని, ఇది మీ తప్పేనని, మీరు మంత్రి కాదని, ఒకవేళ మంత్రి అయినా తాము ఇలాగే అనే వాళ్లమని ఓ ప్రయాణీకుడు అన్నారు. విమానం ఎంట్రెన్స్ వద్ద పలువురు ఆయనను నిలదీశారు. దీంతో మాలిక్ వెనక్కి తిరిగిపోయాడు. అనంతరం ప్రయాణీకులు క్రూ మెంబర్‌తో.. ఫ్లైట్ డోర్లు మూసివేసి, టేకాఫ్ చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఫ్లైట్ తన వల్ల ఆలస్యం కాలేదని రెహ్మాన్ మాలిక్ సామాజిక వెబ్‌సైట్లలో వివరణ ఇచ్చారు.

English summary
A shocking mobile video, which has been uploaded on YouTube, has gone viral. The video shows that former Interior Minister of Pakistan -- Rehman Malik has been thrown off of a plane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X