న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: 28 ఏళ్ల తర్వాత పతకం ఖాయమైంది

By Nageswara Rao

న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించనుంది. తొలి రోజు శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో థాయ్‌లాండ్ జట్టును 3-2తో ఓడించి సెమీస్‌కు చేరింది. దీంతో ఈ జట్టుకు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. 1986 సియోల్ గేమ్స్ తర్వాత భారత్‌కు ఈ క్రీడలో ఏ విభాగంలోనూ పతకం రాలేదు.

28 ఏళ్ల క్రితం పురుషుల టీమ్ ఈ విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. క్వార్టర్ తొలి సింగిల్స్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ 21-15, 17-21, 21-18 తేడాతో ప్రపంచ మాజీ ఛాంపియన్ రచనోక్ ఇంటనోన్‌ను ఓడించి భారత్‌కు శుబారంభాన్నందించింది.

Asian Games: Indian Women Shuttlers Assured of Historic Medal After 28 Years

ఇక రెండో సింగిల్స్‌లో పివి. సింధు 21-15, 21-13తో పోర్న్‌టిప్ పై సునాయాసంగా నెగ్గి భారత్‌కు 2-0తో అధిక్యాన్ని అందించింది. దీంతో భారత్ సెమీస్ చేరడమిక లాంఛనమే అనిపించింది. కానీ మూడో సింగిల్స్ లో బుసానన్ చేతిలో తొలి డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రద్న్య గాద్రె జోడి 17-21, 21-18, 16-21తో పోర్న్ టిప్ - కుంచల జంట చేతిలో ఓడటంతో మ్యాచ్ స్కోరు 2-2తో సమానమైంది.

ఈ స్దితిలో చివరి డబుల్స్‌లో సిధు-అశ్విని జోడీ అద్బుతంగా ఆడి భారత్‌ను విజేతగా నిలిపింది. డబుల్స్‌లో సింధు-అశ్విని జోడీ అధ్బుతంగా ఆడి భారత్‌ను విజేతగా నిలిపారు. ఈ జోడీ 21-16, 21-17తో సప్సిరి-సరలీ జంటను ఓడించింది.

ఇక ఆదివారం జరిగే సెమీస్‌లో భారత్, కొరియాను ఢీకొంటుంది. అంతక ముందు జరిగిన పురుషుల ఫ్రీ క్వార్టర్స్ పోరులో భారత్ 0-3తో కొరియా జేతిలో ఘోరంగా ఓడింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X