న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గాస్లోలో కామన్వెల్త్ గేమ్స్: తిరగబడిన భారత్ జెండా

By Srinivas

గ్లాస్గో: కామన్‌వెల్త్ గేమ్స్ సందర్భంగా విడుదల చేసిన అధికారిక పాట వీడియోలో భారత జాతీయ పతాకం తలకిందులుగా దర్శనమిచ్చింది. దానిలో పైన ఉండాల్సిన కాషాయరంగు కింద, కింద ఉండాల్సిన ఆకుపచ్చ రంగు పైన ఉండేలా జెండాను పట్టుకొని ఉన్నారు.

"లెట్ ది గేమ్స్ బిగిన్' అని మొదలయ్యే పాటలో ఈ దృశ్యం కనిపించింది. ఈ విషయంపై సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. గేమ్స్ కోసం విడుదల చేసిన అఫీషియల్ సాంగ్ వీడియోలో అన్ని కామన్ వెల్త్ దేశాల జెండాలను చిన్నారులు పట్టుకున్నట్టు షూట్ చేశారు.

 Commonwealth Games 2014: Indian flag shown upside down in CWG official song video

మరోవైపు, చైనాలో ఇటీవల జరిగిన ఆసియా కప్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్‌లో ఇద్దరు భారత సిక్కు ఆటగాళ్లు అవమానానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ బాస్కెట్ బాల్ సమాఖ్య నిర్వహించిన టోర్నీలో ఈ నెల 12న జపాన్‌తో భారత్ పోరుకు ముందు అమృతాపాల్ సింగ్, అమ్‌జ్యోత్ సింగ్‌లతో టోర్నీ నిర్వాహకులు వ్యతిరేకమని, వాటితో ఆడేందుకు అనుమతించబోమని వారికి నిర్వాహకులు చెప్పారు.

తాము ఎప్పుడు టర్బన్లతోనే ఆడుతామని, గత ఏడాది మనీలాలో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్‌లో, ఇటీవల గోవాలో నిర్వహించిన లుసోఫోనియా క్రీడల్లో కూడా టర్బన్లతోనే ఆడామని నిర్వాహకుల చర్యతో కలత చెందిన అమృత్ పాల్ సింగ ఓ ఆంగ్ల పత్రికతో చెప్పాడు. సిక్కు ఆటగాళ్లకు అవమానం ఎదురుకావడం పట్ల క్రీడల మంత్రి శర్వానంద్ సోనోవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X