న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక వేధింపు: కామన్వెల్త్‌కొచ్చి చిక్కుల్లో పడ్డ లిఫ్టర్

By Srinivas

గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ లిఫ్టర్ ఒకతను లైంగిక వేధింపుల కేసు చిక్కుల్లో పడ్డాడు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలకు పాపువా న్యూగినియాకు చెందిన ఇరవై రెండేళ్ల తౌవా ఉదియా అనే లిఫ్టర్ వచ్చాడు. ఈ క్రీడలకు వేదికైన గ్లాస్గో నగరంలోని ఓ సూపర్ మార్కెట్ వద్ద ఈ లిఫ్టర్ ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు అభియోగాలు నమోదయ్యాయి.

ఈ ఆరోపణల పైన గ్లాస్గో షెరిఫ్ కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణ సందర్భంగా తౌవా తనపై ఆరోపణలను అంగీకరించలేదని, తదుపరి విచారణ శుక్రవారం ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది.

 Commonwealth Games lifter faces sex assault charge

క్రీడలు జరుగుతున్న నగరం సమీపంలోని ఓ సూపర్ మార్కెట్లో అతని పైన ఆరోపణలు రావడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.

మరోవైపు, మార్కెట్ వద్ద జరిగిన సంఘటన యాధృచ్చికమని, తన ప్రతిష్టకు భంగం కలగాలని తాను కోరుకోవడం లేదని తౌవా ఉదియా ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ మీడియాతో అన్నాడు. కామన్వెల్త్ గేమ్స్ ఫెడెరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మైక్ హూపర్ దీనిపై మాట్లాడుతూ.. ఉదియా పైన క్రిమినల్ కేసు నమోదయిందని చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X