న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అట్టహాసంగా కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం(ఫొటో)

గ్లాస్గో: భాతర బృందం ముందు నడవగా, కామన్వెల్త్ గేమ్స్ గ్లాస్గోలో బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 20వ కామన్వెల్త్ క్రీడల్లో 71 దేశాలకు చెందిన సుమారు 4,500 మంది అథ్లెట్లు వివిధ క్రీడా విభాగాల్లో పోటీపడతారు. ఆగస్టు మూడో తేదీ వరకు జరిగే ఈ ఈవెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంతో మొదలైంది. జూడో క్రీడాకారుడు యుయాన్ బర్టన్ స్కాటిష్ జాతీయ పతాకాన్ని ధరించి సెల్టిక్ పార్క్‌లోకి అడుగుపెట్టినప్పుడు స్టేడియం హర్షధ్వానాలతో మారుమోగింది.

యూనిసెఫ్ ప్రతినిధిగా సచిన్..

యూనిసెఫ్ ప్రతినిధిగా భారత మాజీ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడు. బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2, ప్రధాని కామెరూన్, అతని మంత్రి సహచరులు, స్కాట్‌లాండ్ ఫస్ట్ మినిస్టర్ అలెక్కస సాల్మండ్, కామన్వెల్త్ దేశాలకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యే అరుదైన అవకాశం సచిన్‌కు దక్కింది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభమయ్యాయని ప్రకటించారు.

CWG 2014 starts with a spectacular Opening Ceremony in Glasgow

ఈ పోటీల నిర్వాహణ కమిటీ చైర్మన్ మైఖేల్ కవానాగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక గొప్ప క్రీడోత్సవాన్ని తిలకించే అవకాశం అభిమానులకు దక్కుతుందని అన్నాడు. 11 రోజులు, 18 క్రీడల్లో కామన్వెల్త్ దేశాల అథ్లెట్లు పోటీపడతారని చెప్పాడు. ఒలింపిక్స్ తర్వాత రెండో అతి పెద్ద మల్టీ ఈవెంట్‌గా పేరు సంపాదించిన కామన్వెల్త్‌ను నిర్వహించే అవకాశం దక్కడం తమ అదృష్టమని పేర్కొన్నాడు. ఈ పోటీలకు సంబంధించిన వివిధ కాంట్రాక్టుల విలువ 401 పౌండ్లని అతను తెలిపాడు. ఇంత భారీ వ్యయంతో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ అభిమానులను అలరిస్తాయన్నారు.

స్కాట్‌లాండ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా కామన్వెల్త్ గేమ్స్ సందడి కనిపిస్తోంది. ప్రత్యేకించి గ్లాస్గోలో పం డుగ వాతావరణం నెలకొంది. ఈ క్రీడల మస్కట్ 'క్లైడ్'కు, స్కాట్‌లాండ్ జాతీయ పతాకాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వివిధ దేశాల నుంచి వచ్చిన అభిమానులతో గ్లాస్గో నగరం నిండిపోయింది.

స్కాట్‌లాండ్‌లో మూడోసారి..

ఇంతకు ముందు స్కాట్‌లాండ్ రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమిచ్చింది. ఆ రెండు పర్యాయాలకు ఎడెన్‌బర్గ్ కేంద్రం కాగా, ఇప్పుడు గ్లాస్గోలో పోటీలను నిర్వహిస్తున్నారు. 1930లో హామిల్టన్ (కెనడా)లో మొదటి కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు 11 దేశాలకు చెందిన 400 అథ్లెట్లు పోటీపడ్డారు. గ్లాస్గోలో ఈ సంఘట సుమారు పది రెట్లు పెరిగింది. గ్లాస్గోలోనే 3,000వ కామన్వెల్త్ స్వర్ణ పతకాన్ని బహూకరించనునండడం విశేషం.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X