హుమైమా మాలిక్
మోడల్ మరియు నటి అయిన హుమైమా మాలిక్ గతంలో డేటింగ్ విషయమై అంగీకరించిందట. వసీం అక్రంతో తాను డేటింగ్ చేసినట్లు అప్పుడు చెప్పిందట.
హుమైమా మాలిక్
ఆ తర్వాత, వసీం అక్రం, హుమైమా మాలిక్ ఫోటోలు నెట్లో హల్ చల్ సృష్టించాయి. డేటింగ్ గుప్పుమంది. అనంతరం ఆమె డేటింగ్ అంశాన్ని ఖండించిందట.
హుమైమా మాలిక్
మరోవైపు, హుమైమా మాలిక్ పద్దెనిమిదేళ్ల లోపే పెళ్లయిందట. అనంతరం పెళ్లైన రెండేళ్లకు ఆమె విడాకులు తీసుకుందట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ డెయిలీ చెప్పింది.
హుమైమా మాలిక్
పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్‌తో తనకు సంబంధాలు అంటగడుతూ మీడియాలో వస్తున్న వార్తల పైన ప్రముఖ నటి హుమైమా మాలిక్ కొద్ది రోజుల క్రితమే స్పందించారు. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని ఆమె వివరణ ఇచ్చారు.
హుమైమా మాలిక్
తామిద్దరం ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామని చెప్పారు. తమ మధ్య ఏదో ఉందన్న వార్తలు ఎక్కడ నుండి వస్తున్నాయో తనకు ఏమాత్రం అర్థం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హుమైమా మాలిక్
అక్రమ్ ఓ వివాహితుడు, పైగా ఓ తండ్రి కూడా అని ఆమె పేర్కొన్నారు. అతడిని తాను గౌరవిస్తానని పేర్కొన్నారు. ఇలాంటి పుకార్లు తమ మధ్య ఉన్న మంచి స్నేహాన్ని దెబ్బతీయలేవని తెలిపారు.
హుమైమా మాలిక్
తమ మధ్య మాత్రం ఎలాంటి సంబంధం లేదని హుమైమా మాలిక్ పేర్కొన్నారు. తన గురించి తన కుటుంబ సభ్యులకు పూర్తిగా తెలుసునని చెప్పారు. తాను ఎవరితోనైనా డేటింగ్ చేస్తే తప్పకుండా చెబుతానని అన్నారు. అయితే, హుమైమా డేటింగ్ వార్తలను కొట్టిపారేస్తున్నప్పటికీ.. పుకార్లు వినిపించడం గమనార్హం.