న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పెళ్లి కూతురాయె

By Pratap

విజయవాడ‌: ప్రముఖ చెస్ క్రీడాకారిణి, తెలుగుతేజం కోనేరు హంపి పెళ్లి కూతురైంది. బుధవారం రాత్రి హంపి వివాహం జరగనుంది. ఎప్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ తనయుడు అన్వేష్‌తో బుధవారం రాత్రి ఆమె వివాహం జరుగనుంది.

బుధవారం ఉదయం హంపిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు. తెలుగుదనం, సంప్రదాయం ఉట్టిపడే విధంగా హంపి పట్టు చీరలో మెరిసిపోయింది. హంపి కుటుంబ సభ్యులు పూజాకార్యక్రమాలు నిర్వహించారు.

హంపి, అన్వేష్ జోడీ పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. విజయవాడలోని వివాహ వేదిక ఏ కన్వెన్షన్ సెంటర్‌ను అందంగా అలంకరించారు. ఇరువురి కుటుంబ పెద్దల ఆమోదంతోనే వారి వివాహం జరుగుతోంది. హంపి వివాహానికి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.

Koneru Humpy to weds Anvesh today

చెస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో కోనేరు హంపి మూడో స్థానంలో ఉంది. ఇటీవలే అన్వేష్‌తో కోనేరు హంపి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఆమె చదరంగ పోటీల్లో పాల్గొంటుందని సమాచారం. 1987 మార్చి 31న ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో జన్మించిన కోనేరు హంపి భారతదేశపు ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.

2007 అక్టోబర్ లో ఫైడ్ ఎలో రేటింగ్‌లో 2600 పాయింట్లను దాటి మహిళా చదరంగంలో జూడిత్ పోల్గర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో నిల్చింది. ఈ స్థానం సంపాదించిన భారతదేశపు తొలి చెస్ క్రీడాకారిణి హంపి.

మహిళా గ్రాండ్ మాస్టర్‌లలోనే కాదు మొత్తం గ్రాండ్ మాస్టర్లలో అతి పిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన రికార్డు సృష్టించింది. కేలవం 15 సంవత్సరాల 1 నెల, 27 రోజుల వయస్సులోనే ఈ స్థానానికి ఎదిగింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X