న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్దార్.. లవ్యూ: హాకీ టీం సారథి, గర్ల్‌ని కలిపిన ఫేస్‌బుక్

By Srinivas

న్యూఢిల్లీ: భారత హాకీ జట్టు సారథి ఫేస్‌బుక్ ద్వారా జోడీ దొరికింది. ప్రముఖ క్రీడాకారుల ప్రేమాయణాల ప్రస్తావన వస్తే క్రికెట్, టెన్నిస్, ఫుట్‌బాల్ ప్లేయర్లు ఎక్కువగా గుర్తుకు వస్తారు. ఇప్పుడు హాకీ సారథి సర్దార్ సింగ్ కూడా ఆ జాబితాలో చేరాడు. ఇంగ్లాండు హాకీ జట్టు యువ క్రీడాకారిణి అశ్‌పాల్ కౌర్‌తో రెండేళ్ల క్రితం చాటింగ్ ద్వారా మొదలైన వీరి పరిచయం.. ప్రేమగా మారి.. పెళ్లి వరకు వెళ్తోంది.

'సర్దార్ సింగ్.. నువ్వు గొప్ప ఆటగాడివి. నువ్వంటే నాకిష్టం' అని తొలిసారి అశ్‌పాల్ ఫేస్‌‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కూడా అశ్‌పాల్ తరుచూ సర్దార్‌కు సందేశాలు పంపించింది. అతను కూడా స్పందించాడు. ఈ సందేశాలతో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. చివరకు సర్దార్ ఇంగ్లాండుకు వెళ్లి మరీ అశ్‌పాల్‌ను కలిసి వచ్చాడు. తర్వాత ఇంట్లో ప్రేమ విషయం చెప్పాడు.

Love blossoms for Sardar Singh on Facebook, marriage has to wait for Rio

ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. అశ్‌పాల్ ప్రస్తుతం హర్యానాలోని సర్దార్ సొంత గ్రామంలో ఉంది. రెండు కుటుంబాలు సాధ్యమైనంత తొందరగా పెళ్లి చేయాలని చూస్తున్నాయి. అయితే, సర్దార్ మాత్రం 2016 ఒలింపిక్స్‌కు వెళ్లొచ్చాకే పెళ్లి చేసుకుంటామని చెబుతున్నాడు. ఈ ఏడాది మే 22న ఆమె వద్ద అతను పెళ్లి ప్రస్తావన తెచ్చాడు.

ఒకరోజు తన ఫేస్‌బుక్ అకౌంటుకు వచ్చిన సందేశాన్ని చూస్తే, ఆమె పేరు మీద వచ్చిందని, తొలుత తేలిగ్గా తీసుకున్నానని, ఆ తర్వాత వరుసగా తన గురించి ఎన్నో విషయాలు రాయడంతో ఆసక్తి పెరిగిందని, ఓసారి కలువాలనుకున్నానని, లండన్ ఒలింపిక్స్‌లో మ్యాచ్ తిలకించేందుకు రావాలని చెప్పానని, ఆమె రాలేదని సర్దార్ గుర్తు చేసుకున్నాడు. లండన్ ఒలింపిక్స్ తర్వాత తమ మధ్య ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ పరంపర కొనసాగిందన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X