న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళా లిఫ్టర్‌పై వేధింపులు: బాక్సర్ డింకో సింగ్ అరెస్ట్

Manipur boxer Dingko Singh held for assaulting woman athlete
ఇంఫాల్: ఏసియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ డింకో సింగ్‌ను మణిపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ వెయిట్ లిఫ్టర్‌పై వేధింపులకు పాల్పడిన కేసులో డింకో సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. డింకో సింగ్‌ను కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు పోలీసులు చెప్పారు.

మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్‌లోని ఖుమన్ లంపక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద జనవరి 13న 17ఏళ్ల మహిళా వెయిట్ లిఫ్టర్‌పై వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు చెప్పారు. అతని కారుపై ఓజా డింకో అని రాసినందుకు తనను కర్రతో తీవ్రంగా కొట్టాడని సదరు మహిళా లిఫ్టర్ ఫిర్యాదు చేసిందని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు చెప్పారు.

కాగా డింకో సింగ్ మాత్రం.. ఆ మహిళా లిఫ్టర్ 'ఓజా డింకో విత్ లవ్ ఫ్రం...' అని రాసిందని పేర్కొన్నాడు. 1998లో జరిగిన ఏసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలుపొందడంతో డింకో సింగ్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అనంతరం అతన్ని కేంద్ర ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.

డింకో సింగ్‌ను 2013లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచ్‌గా నియమించింది. అయితే ఇలాంటి వ్యక్తి ఓ మహిళా లిఫ్టర్‌పై వేధింపులకు పాల్పడటంతో అతనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా వెయిట్ లిఫ్టర్‌పై వేధింపులకు పాల్పడటాన్ని మణిపూర్ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. డింకోపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X