న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ విజేత ప్రణయ్

By Pratap

పలెంబాంగ్ (ఇండోనేసియా): ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ టైటిల్‌ను భారత ఆటగాడు ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన అతను 43 నిమిషాలు జరిగిన తుది పోరులో స్థానిక ఫేవరిట్ ఫిర్మన్ అబ్దుల్ కొలిక్‌ను 21-11, 22-20 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు.

కెరీర్‌లో తొలి టైటిల్ సాధించిన అతను గత వారం హోచిమిన్ సిటీలో జరిగిన వియత్నామ్ గ్రాండ్ ప్రీలో రన్నరప్‌గా నిలిచాడు. ఇండోనేసియా మాస్టర్స్‌లో అద్వితీయ ప్రతిభ కనబరిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు. అంతకు ముందు సెమీ ఫైనల్‌లో అతను మలేసియాకు చెందిన డారెన్ లియూను 21-14, 14-21, 21-14 తేడాతో ఓడించాడు. సుమారు గంట సేపు జరిగిన ఈ పోరు ప్రేక్షకులు ఆకట్టుకుంది.

Prannoy wins Indonesian Masters Grand Prix Gold

ఒకప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్న లియూతో ప్రణయ్ గతంలో ఒకేఒకసారి తలపడ్డాడు. 2012 మలేసియన్ ఓపెన్‌లో అతను లియూను ఓడించాడు. ఇప్పుడు మరోసారి అతనిపై ఆధిపత్యాన్ని కనబరిచాడు. 2010 సమ్మర్ యూత్ ఒలింపిక్స్ బాయిస్ సింగిల్స్‌లో రజత పతకం సాధించిన ప్రణయ్ సీనియర్స్ విభాగంలోనూ రాణించడమేగాక, కెరీర్‌లో మొదటి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

విజయం తనకు ఆనందం ఇచ్చిందని ప్రణయ్ అన్నాడు. తాను ఈ టైటిల్ గెలుచుకుంటానని అనుకోలేదని అతను అన్నారడు. వియత్నాంతో ఓటమితో అసంతృప్తికి గురయ్యానని ఆయన అన్నారు. తన దేహం అలసిపోయిందని, అయితే రోజు రోజుకూ విశ్వాసంతో ముందుకు సాగానని ప్రణయ్ అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X