న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెన్నిస్: సాకేత్ జోడీ రజతం, భారత్ హాకీ దశ మారేనా..!

By Nageswara Rao

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్‌లో టెన్నిస్ డబుల్స్ విభాగంలో పైనల్‌కు చేరిన భారత టెన్నిస్ జోడీ సాకేత్ సాయి మైనేని, సనమ్ సింగ్ రజతం సాధించారు.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో థాయా‌లాండ్ ఆటగాళ్లపై విజయ సాధించి.. ఫైనల్‌కు వెళ్లారు. సోమవారం జరిగిన ఫైనల్స్‌లో దక్షిణ కొరియా ఆటగాళ్లు యంగ్ క్యూలిమ్, హెన్ చుంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Sanam Singh and Saketh Sai Myneni win 6th silver for India in Asian Games 2014

29 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 5-7, 6-7 తేడాతో ఓడిపోయారు. ఆది నుంచి కూడా ఈ మ్యాచ్‌లో దక్షిణ కొరియా ఆటగాళ్లు పైచేయి సాధించారు. ఇక భారత పురుషలు హాకీ జట్టు సెమీకు చేరుకుంది. భారత హాకీ జట్టు బంగారు పతకం సాధించి 16 ఏళ్లు దాటింది.

1998లో ధనరాజ్ పిళ్లై కెప్టెన్స్లీలో స్వర్ణం సాధించిన భారత్ ఇప్పటి వరకూ ఆ పతకాన్ని దక్కించుకోలేదు. దీంతో రేపు మంగళవారం దక్షిణ కొరియాతో జరగనున్న మ్యాచ్ ప్రతిష్టాత్మకం కానుంది. భారత్, దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరితే 2016 రియో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధిస్తుంది.

61 కిలోల ప్రీస్టయిల్ రెజ్లింగ్‌లో భారత క్రీడాకారుడు భజరంగ్ రజతం సాధించాడు. 74 కిలోల ప్రీస్టయిల్ రెజ్లింగ్‌లో నర్సింగ్ యాదవ్ కాంస్య పతకం గెలిచాడు. మహిళల 1500 మీటర్ల పరుగులో జైషా కాంస్యం సాధించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X