హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భద్రుకా యువతులు ఆడిపాడారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన తెలంగాణ వేడుకల సందర్భంగా హైదరాబాద్ కూడా ఆనందోత్సాహాల మధ్య తేలియాడుతోంది. బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ జరుగుతుంది. ఈ సందర్భంగా హైదరాబాదులోని భద్రుకా కాలేజీ విద్యార్థినులు బతుకమ్మ ఆడారు.

భద్రుకా కాలేజీ విద్యార్థినులు గార్భా నృత్యం కూడా చేశారు. యువతులు ఆనందోల్లాసాలతో బతుకమ్మ వేడుకలను నిర్వహించుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుండడంతో హైదరాబాదులో కూడా గత తొమ్మిది రోజులుగా బతుకమ్మ పండుగతో తేలియాడుతోంది. కార్యాలయాలు, విద్యాలయాలు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

విద్యార్థినుల బతుకమ్మ

విద్యార్థినుల బతుకమ్మ

హైదరాబాదులోని భద్రుకా కాలేజీ కామర్స్ అండ్ ఆర్ట్స్ విద్యార్థినులు గురువారంనాడు సద్దుల బతుకమ్మ ఆడారు.

విద్యార్థినుల బతుకమ్మ

విద్యార్థినుల బతుకమ్మ

హైదరాబాదులోని భద్రుకా కాలేజీ విద్యార్థినులు బతుకమ్మను పేర్చి, మధ్యలో ఉంచి, చుట్టూ తిరుగుతూ బతుకమ్మ ఆడారు.

గార్భా నృత్యం

గార్భా నృత్యం

భద్రుకా కాలేజీ విద్యార్థినులు బతుకమ్మ ఆడడంతో పాటు గార్భా నృత్యం చేశారు. రంగు రంగుల వస్త్రధారణతో వారు వాతావరణానికి రంగులు అద్దారు.

గార్భా నృత్యం

గార్భా నృత్యం

భద్రుకా కాలేజీ కామర్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థినులు గురువారంనాడు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. గార్భా నృత్యంతో అలరించారు.

English summary
Badruka College of commerce and arts students perform Bathukamma and garbha dance are celebrate Bathukamma festival in city on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X