వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదోళ్ల ఉద్యమం బతుకమ్మ‌: విమలక్క (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ రెండో తేదీ వరకు జరిగే బతుకమ్మ పండుగను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూలు లేకుంటే బతుకమ్మ లేదని, సహజత్వం లేకుంటే పండుగ కాదని చాటుదామంటూ బహుజన బతుకమ్మను ఊరూర, వాడవాడా జరుపుకునేలా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోందని అధ్యక్షురాలు, విప్లవ గాయని విమలక్క తెలిపారు.

ఇందులో భాగంగానే ఈ నెల 24న వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి మండలం అర్వపల్లి, 25న హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండ, 26న నల్లగొండ జిల్లా ఎస్‌.ఆత్మకూరు మండలం రామన్నగూడెం, 25న ఖమ్మం పట్టణంలో, 28న రంగారెడ్డి జిల్లా షాబాద్‌, పాలమూరు జిల్లా షాద్‌నగర్‌, 29న కరీంనగర్‌ జిల్లా వేములవాడ, 30న అదిలాబాద్‌ జిల్లా శ్రీరాంనగర్‌, అక్టోబర్‌ ఒకటో తేదీన మెదక్‌ జిల్లా చిన్న శంకరంపేట మండలం రుద్రారం, రెండో తేదీన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరులో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

బతుకమ్మను పేదోళ్ల ఉద్యమంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక సమాజాన్ని సెప్టెంబర్‌ 24,1872 న ప్రారంభించారని... ఇదే తేదీన ఈ ఏడాది ఎంగిలి బతుకమ్మ ప్రారంభమవుతోందన్నారు. పూలే స్ఫూర్తితో సమాజంలో కుల-వర్గ అసమానతలు అంతం చేయాలనే దీక్షతో బతకమ్మను జరుపుకుందామని విమలక్క పిలుపునిచ్చారు.

పేదోళ్ల ఉద్యమం బతుకమ్మ

పేదోళ్ల ఉద్యమం బతుకమ్మ

బతుకమ్మ పండుగ పేదోళ్ల ఉద్యమమని ప్రముఖ విప్లవ గాయని విమలక్క అన్నారు. బతుకమ్మపై పుస్తకాన్ని ఆమె ఆవిష్కరించారు.

బతుకమ్మపై పుస్తకావిష్కరణ

బతుకమ్మపై పుస్తకావిష్కరణ

బతుకమ్మపై పుస్తకాన్ని విమలక్క ఆవిష్కరించారు. హైదరాబాదులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇలా పలువురు రచయితలు, ఉద్యమకారులు...

జయధీర్ తిరుమలరావు కూడా...

జయధీర్ తిరుమలరావు కూడా...

బతుకమ్మపై పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో విమలక్కతో పాటు ప్రముఖ పరిశోధకుడు, రచయిత జయధీర్ తిరుమల రావు కూడా ఉన్నారు.

కేశవరావు జాదవ్ సైతం

కేశవరావు జాదవ్ సైతం

బతుకమ్మపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో ప్రముఖ తెలంగాణ ఉద్యమనేత కేశవరావ్ జాదవ్ కూడా ఉన్నారు.

English summary
Revolutionary singer Vimalakka launched book on Bathukamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X