వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొన్నాల, జానా మధ్య బయటపడిన విభేదాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెసు శాసనసభా పక్ష నేత కె. జానా రెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. రైతుల ఆత్మహత్యలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే విషయంపై పొన్నాల, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పొన్నాల, జానా రెడ్డి మధ్య అభిప్రాయభేదాలు బయటపడ్డాయి.

రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడాలని షబ్బీర్ అలీ, పొంగులేటి సూచించారు. వారి అభిప్రాయంతో పొన్నాల లక్ష్మయ్య ఏకీభవించారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలే అయినందున సంయమనం పాటించాలని, కొంత కాలం వేచి చూడాలని జానారెడ్డి అభిప్రాయప్డాడరు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గొంతు ఎత్తాల్సిందేనని, అయితే ఇప్పుడే క్షేత్ర స్థాయిలో పోరాటాలు అవసరం లేనది జానారెడ్డి అన్నట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాలని షబ్బీర్, పొంగులేటి ప్రతిపాదించారు.

Differences cropped up between Ponnala and Jana reddy

రాహాస తెలంగాణలో ఓవైపు పండుగ వాతావరణం ఉంటే మరోవైపు చావు డప్పులు మోగుతుండడం బాధాకరమని తెలగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

తెలంగాణ మంత్రులు సైతం బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన దాఖలు లేవని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక వైపు పంటలు పండక, పండిన పంటకు గిట్టుబాటు ధరలు రాక, మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

English summary
Differences cropped up between Telangana PCC president Ponnala Laxmaiah and senior leader K Jana Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X