హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ సర్టిఫికెట్ల ముఠా పట్టివేత (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి ఇతరులకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ తూర్పు మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డిసిపి లింబారెడ్డి, ఈస్ట్ జోన్ ఇంచార్జీ ఇన్‌స్పెక్టర్ ఎపి ఆనందకుమార్ అందుకు సంబంధిచిన వివరాలను వెల్లడించారు.

జియాగుడా భీమ్‌నగర్ ముస్తయిద్‌పురాకు చెందిన షఫీక్ అహ్మద్ (44) డిగ్రీ పూర్తి చేశాడు. పదమూడేళ్ల పాటు భారతీ మోడల్ స్కూల్ పేరిట విద్యాసంస్థలు నడిపాడు. ఆదాయం రాకపోవడంతో పలు విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయించే పథకం రచించాడు.

అత్తాపూర్ ఎంఎం పహడీ నివాసి ఇక్రం (24) కిషన్‌బాగ్‌లో జిరాక్స్ నడిపిస్తుండేవాడు. ఇతనితో కలిసి షఫీక్ వందల మందికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయించాడు.

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి ఇతరులకు విక్రయిస్తున్న ఇద్దరి ముటాను హైదరాబాద్ తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

పది, ఇంటర్, డిగ్రీ, పీజి, ఇంజనీరింగ్, పారా మెడికల్ తదితర సర్టిఫికెట్లను షఫీక్, ఇక్రం పది నుంచి 20 రూపాయల ధరకు విక్రయించేవారు.

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ గుర్తింపు కార్డుతో మీడియా విలేకరిగా కూడా షఫీక్ చెలామణి అవుతున్నాడు. ఇతని నుంచి నకిలీ సర్టిఫికెట్లు, రబ్బరు స్టాంపులు, రూ.40 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

షఫీక్, ఇక్రం ఇచ్చిన నకిలీ సర్టిఫికెట్‌తో విదేశాల్లో చిక్కిన ఓ వ్యక్తి ద్వారా ఈ వ్యవహారం గుట్టు రట్టయింది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నిందితులు షఫీక్, ఇక్రం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వివిధ నకిలీ సర్టిఫికెట్లు, నగదు ఇలా మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

6. నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ సర్టిఫికెట్ల ముఠా

నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడానికి నిందితులు షఫీక్, ఇక్రం తయారు చేసుకున్న రబ్బరు స్టాంపులు ఇలా కుప్పగా..

English summary
Two accused involved in fake certificates have been nabbed by Hyderabad Taskforce east zone police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X